AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!

School Holidays: తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త. మరో ఐదు రోజుల్లో ముగియనున్న వేసవి సెలవులను పొడిగింపుతో విద్యార్థుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వేసవి సెలవులు మండిపోతున్నాయి. దీంతో అధికారులు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవులును పొడిగించారు..

School Holidays: తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!
School Holidays
Subhash Goud
|

Updated on: Jun 06, 2026 | 12:02 PM

Share

School Holidays: తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు వేసవి సెలవులు కూడా ముగియనున్నాయి. ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన విద్యార్థులకు సెలవులు.. జూన్‌ 12న పునః ప్రారంభం కానున్నాయి. అయితే భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులకు సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలవులను పొడిగించడం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేసవి తాపం నుండి తప్పించుకోగలరని అధికారులు భావించారు. ఇదిలా ఉంటే జూన్‌ 12 శుక్రవారం వస్తోంది. అలాగే 13 శనివారం, 14 ఆదివారం. దీంతో ఈ రెండు రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే 15 నుంచి కొన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులకు హాలీడేస్‌ పొడిగించడంతో విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మరికొన్ని రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్నింటిలో జూన్ 15 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పొడిగించిన సెలవులు అన్ని ప్రాంతాలలో కాదు. కేవలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సెలవులు ఉన్నాయి.

అంగన్‌వాడి సెంటర్లకు సెలవుల పొడిగింపు:

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో అంగన్‌వాడి మే 1 నుండి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. జూన్ 2 నుండి రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు పున:ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రవ ఎక్కువగా ఉన్నందున చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే మరికొన్నిరోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీలకు కూడా జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సెలవుల పొడిగింపుపై ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అంగన్వాడీలకు అదనంగా మరో 13 రోజుల సమ్మర్ హాలిడేస్ వచ్చాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఊహించని విధంగా పతనం.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us