AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లిటిల్ మాస్టర్ కీలక స్పీచ్.. ఇంతలో భార్య నుంచి ఫోన్.. సునీల్ గావస్కర్ ఏం చేశారంటే?

Cricket legend Sunil Gavaskar: సునీల్ గావస్కర్ కేవలం రికార్డుల వీరుడే కాదు, అంతకుమించి మానవీయ విలువలు, హాస్యచతురత కలిగిన గొప్ప వ్యక్తి అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి, కుటుంబ బంధాలకు ఇచ్చే ప్రాధాన్యతకు ఈ 'లిటిల్ మాస్టర్' ప్రవర్తనే ఒక నిలువెత్తు నిదర్శనం.

Video: లిటిల్ మాస్టర్ కీలక స్పీచ్.. ఇంతలో భార్య నుంచి ఫోన్.. సునీల్ గావస్కర్ ఏం చేశారంటే?
Sunil Gavaskar Stops Speech To Attend Wifes Phone Call
Venkata Chari
|

Updated on: Jun 06, 2026 | 11:53 AM

Share

Cricket legend Sunil Gavaskar: ముంబయిలోని రోటరీ క్లబ్ వేదికగా జరిగిన ఒక హృదయపూర్వకమైన కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన పని ఇప్పుడు నెటిజన్ల మనసులను దోచేస్తోంది. దాదాపు 850 మంది చిన్నారుల ఉచిత గుండె శస్త్రచికిత్సల విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

మైకు ముందు క్రికెట్ లెజెండ్.. ఇంతలో ఫోన్ కాల్!

సమాజంలో నిరుపేద బాలల ప్రాణాలు కాపాడే ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ అనే గొప్ప కార్యక్రమంలో సునీల్ గావస్కర్ మాట్లాడుతున్నారు. సభికులంతా ఆయన మాటలను ఎంతో నిశ్శబ్దంగా వింటున్నారు. సరిగ్గా అదే సమయంలో గావస్కర్ మొబైల్ ఫోన్ మోగింది. సాధారణంగా ఎంతటి పెద్దవారైనా బహిరంగ సభల్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే కట్ చేయడం లేదా పక్కన పెట్టడం చేస్తుంటారు. కానీ, గావస్కర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘మా ఆవిడ నుంచి ఫోన్.. మాట్లాడకపోతే ఎలా?’

తన ఫోన్ స్క్రీన్ వైపు చూసిన గావస్కర్, ఏమాత్రం సంకోచించకుండా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. సభలో ఉన్న వారందరికీ వినపడేలా మైకులోనే క్షమాపణలు చెబుతూ.. ‘‘ఈ ఫోన్ కచ్చితంగా మా ఆవిడ (మార్షనీల్) నుంచే వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, ఈ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. బహుశా సభలో మరీ అంత ఎక్కువగా మాట్లాడకూడదని ఆమె నాకు గుర్తు చేస్తున్నట్లుంది’’ అంటూ తనదైన శైలిలో చమత్కరించారు.

గావస్కర్ నోటి నుంచి వచ్చిన ఈ మాటలకు హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. భార్య పట్ల ఆయనకున్న గౌరవానికి, ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన సమయస్ఫూర్తికి సభికులంతా చప్పట్లతో అభినందనలు కురిపించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలు

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు గావస్కర్ సరళతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ప్రపంచం మెచ్చిన గొప్ప క్రికెటర్ అయినా, కోట్లాది మంది అభిమానించే దిగ్గజమైనా.. ఇంట్లో భార్య మాటకు ఇచ్చే విలువ ముఖ్యం” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మైదానంలోనే కాదు, నిజ జీవితంలోనూ గావస్కర్ జెంటిల్‌మెన్ అనిపించుకున్నారని కొనియాడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us