AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం.. డిసెంబర్ వరకు ధనవర్షం, కెరీర్‌లో సూపర్ సక్సెస్!

Zodiac Signs Lucky Till December: గ్రహాల అనుకూల సంచారం కారణంగా డిసెంబర్ 2026 వరకు మేష, సింహ, తులా, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు కనిపించనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల్లో పురోగతితో పాటు నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

Rajashekher G
|

Updated on: Jun 06, 2026 | 10:33 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం చివరి వరకు కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. గ్రహాల అనుకూల సంచారం కారణంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభించడమే కాకుండా, ఆర్థికంగా కూడా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తవడం, ఆదాయ వనరులు పెరగడం, ఉద్యోగం-వ్యాపారంలో పురోగతి సాధించడం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. మరి డిసెంబర్ వరకు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 7
మేష రాశి.. ఈ రాశి వారికి ఈ కాలం పురోగతికి దారి తీసే సమయంగా మారవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు, చట్టపరమైన వ్యవహారాలు లేదా వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.       ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశాలు లభిస్తాయి. విహారయాత్రలు లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా కలిసివచ్చే సూచనలు ఉన్నాయి.

2 / 7
సింహ రాశి.. ఈ రాశి వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు ఎదురుకానున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి.

3 / 7
తులా రాశి.. వారికి ఆర్థిక పరంగా సానుకూల మార్పులు కనిపించవచ్చు. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతాల పెంపు వంటి శుభవార్తలు అందవచ్చు. వ్యాపార విస్తరణకు లేదా కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు.

4 / 7
ధనుస్సు రాశి.. ఈ రాశి వారికి ఈ కాలం అనేక శుభ పరిణామాలను తీసుకురావచ్చు. అదృష్టం అనుకూలంగా ఉండటంతో కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ లాభాలు పొందవచ్చు. ఉద్యోగ సంబంధిత లేదా వ్యాపార విస్తరణ కోసం చేపట్టే ప్రయాణాలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది.

5 / 7
మకర రాశి.. ఈ రాశి వారికి డిసెంబర్ వరకు సమయం ఫలప్రదంగా ఉండే సూచనలు ఉన్నాయి.   కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గి పొదుపు పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో ఉన్న విభేదాలు సద్దుమణిగి కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.

6 / 7
కుంభ రాశి.. ఈ రాశి వారికి ఈ కాలం కొత్త ఆరంభాలకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకునేవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు పెరగడంతో పాటు ఉద్యోగ రంగంలో సహచరుల మద్దతు లభిస్తుంది. ఆస్తి, కోర్టు లేదా ఇతర వివాదాస్పద అంశాలు పరిష్కార దిశగా సాగవచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉండే సూచనలు ఉన్నాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

కుంభ రాశి.. ఈ రాశి వారికి ఈ కాలం కొత్త ఆరంభాలకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకునేవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో లాభాలు పెరగడంతో పాటు ఉద్యోగ రంగంలో సహచరుల మద్దతు లభిస్తుంది. ఆస్తి, కోర్టు లేదా ఇతర వివాదాస్పద అంశాలు పరిష్కార దిశగా సాగవచ్చు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉండే సూచనలు ఉన్నాయి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

7 / 7
Follow Us