AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 రోజులు గడిచినా మిస్టరీగానే విద్యార్థిని మృతి కేసు..అతడిపైనే అనుమానాలు!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మే 11న జరిగిన 18 ఏళ్ల విద్యార్థిని ఖ్యాతి జైన్ అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఒక యువతి ఇలా అకాల మరణం చెందడం, ఘటన జరిగి 24 రోజులు గడిచినా పోలీసులు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయకపోవడంపై ప్రజల్లో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

24 రోజులు గడిచినా మిస్టరీగానే విద్యార్థిని మృతి కేసు..అతడిపైనే అనుమానాలు!
Bhopal Student Death
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 12:11 PM

Share

ఖ్యాతి జైన్ అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని మే 11, 2026న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరిగి 24 రోజులు గడిచినా ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఇంత ఘోరంగా దిగజారిపోయిందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. మృతురాలు ఖ్యాతి జైన్ తల్లి వర్షా జైన్ తన కూతురి మరణంపై పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ కమిషనర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అయినా ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలో తన కూతురి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు నిర్వహించి, మరణాన్ని హత్య కేసుగా నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేసులో భాగంగా మృతురాలి తల్లి కూతురి ప్రియుడి గురించి కూడా పలు విషయాలు బయటపెట్టింది. ఖ్యాతి మరణానికి ముందు ఆమె ప్రియుడు తనీష్ దాదాపు మూడు గంటల పాటు ఇంట్లోనే ఉన్నాడని తల్లి ఆరోపిస్తున్నారు. అతనే తన కూతురి ప్రాణాలను తీసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని కోరుతోంది.

తాను ఇంటర్వ్యూ పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఖ్యాతి ప్రియుడు తనీష్ ఇంట్లోనే ఉన్నాడని, అనంతరం తన కూతురు మృతి చెందిన విషయాన్ని అతనే తనకు సమాచారం అందించాడని పోలీసుల విచారణలో వర్షా చెప్పారు. అంతేకాకుండా, ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత తనీష్ మళ్లీ ఇంటికి వచ్చి వీడియో చిత్రీకరించాడని, ఈ అంశంపై కూడా విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. “అమ్మా.. మీరు నా ప్రాణం తీసేశారు” అని రాసి ఉన్న సందేశం ఖ్యాతి పంపినట్లుగా చెబుతుండడంతో కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. పోలీసుల విచారణలో ఖ్యాతి ఇంట్లోకి తనీష్ ప్రవేశిస్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా.. పోలీసులు ప్రస్తుతం ఖ్యాతి కేసును ఆత్మహత్య కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, ఖ్యాతి ప్రియుడు తనీష్‌ను కూడా విచారిస్తున్నామని తెలిపారు. సైబర్ ఫోరెన్సిక్ నివేదికతో పాటు బిస్రా పరీక్షా ఫలితాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. ఖ్యాతి జైన్ మృతి చెంది 24 రోజులు గడిచినా ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదని ఆమె తల్లి వర్షా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖ్యాతి జైన్ మృతి కేసులో ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నా, అసలు నిజాలు ఓ కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం తమ దగ్గరున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకైతే ఎవరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Follow Us
నా భర్త తెలుగువారే: సుమంగళి
నా భర్త తెలుగువారే: సుమంగళి
పాత దేవుడి పటాలు, విగ్రహాలు ఇక చెత్తలో కాదు.. జీహెచ్‌ఎంసీ కొత్త..
పాత దేవుడి పటాలు, విగ్రహాలు ఇక చెత్తలో కాదు.. జీహెచ్‌ఎంసీ కొత్త..
జాన్వీ పాత్ర పై కామెంట్స్.. పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు
జాన్వీ పాత్ర పై కామెంట్స్.. పెద్ది సినిమా నుంచి ఆ సీన్స్ తొలగింపు
ఇల్లు తుడిచే నీటిలో ఈ పదార్థాలను కలపండి! ఏసీలా చల్లగా, అద్దంలాంటి
ఇల్లు తుడిచే నీటిలో ఈ పదార్థాలను కలపండి! ఏసీలా చల్లగా, అద్దంలాంటి
ధోనీ సరసన రిషభ్ పంత్.. 'హాఫ్ సెంచరీ'తో అరుదైన మైలురాయి..!
ధోనీ సరసన రిషభ్ పంత్.. 'హాఫ్ సెంచరీ'తో అరుదైన మైలురాయి..!
తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!
తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!
రూ.2.15లక్షల డిస్కౌంట్.. కారు కొనాలనుకునే వారికి పండగే..
రూ.2.15లక్షల డిస్కౌంట్.. కారు కొనాలనుకునే వారికి పండగే..
నేను ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది.. కానీ..
నేను ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది.. కానీ..
కీలక స్పీచ్ ఇస్తోన్న లిటిల్ మాస్టర్.. ఇంతలో భార్య నుంచి ఫోన్..
కీలక స్పీచ్ ఇస్తోన్న లిటిల్ మాస్టర్.. ఇంతలో భార్య నుంచి ఫోన్..
గుడ్లను డజన్ లెక్కలోనే ఎందుకు అమ్ముతారు? ఆసక్తికరమైన చరిత్ర ఇదే!
గుడ్లను డజన్ లెక్కలోనే ఎందుకు అమ్ముతారు? ఆసక్తికరమైన చరిత్ర ఇదే!