AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppal Balu: అక్కడ కూడా ఎందుకు బాలు ఈ పనులు.. తప్పు కదా..!

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి ఘాట్ రోడ్డుపై సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్‌లు వివాదానికి దారితీశాయి. వైరల్ వీడియోలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Uppal Balu: అక్కడ కూడా ఎందుకు బాలు ఈ పనులు.. తప్పు కదా..!
Uppal Balu
Sravan Kumar B
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 7:56 AM

Share

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్‌లు వివాదానికి దారితీశాయి. అనంతగిరి ఘాట్ రోడ్డుపై కారు పైభాగంపై కూర్చొని విన్యాసాలు చేసినట్లు కనిపిస్తున్న ఉప్పల్ బాలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించే పవిత్రమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి చర్యలు యువతకు తప్పు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో, ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సాధారణ పర్యాటకులు చిన్న కెమెరాలతో ఫొటోలు లేదా వీడియోలు చిత్రీకరించినా నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటారని, అయితే బహిరంగంగా స్టంట్‌లు చేస్తూ వీడియోలు చిత్రీకరించిన వారిపై ఎందుకు స్పందించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అనంతగిరి ఘాట్ రోడ్డుపై ఉప్పల్ బాలు, అతని అనుచరులు చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ స్టంట్‌లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరిస్తేనే పర్యాటక ప్రాంతాల గౌరవం, భద్రత పరిరక్షించబడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు లేదా అటవీ శాఖ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రామాణికత, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారుల విచారణ అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వీడియో దిగునవ చూడండి..

Follow Us
గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..
గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..
ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి
ప్రతి విద్యార్థి 2 భాషలు నేర్చుకోవాలి.. ఒకటి మాట్లాడటానికి మరొకటి
అదుర్స్ బామ్మ కన్నుమూత..
అదుర్స్ బామ్మ కన్నుమూత..
ఐదింటిలో మధ్య వేలు మాత్రమే ఎందుకు పొడవుగా ఉంటుంది..?
ఐదింటిలో మధ్య వేలు మాత్రమే ఎందుకు పొడవుగా ఉంటుంది..?
నీళ్లను తాడుతో కట్టగలమా? 99 శాతం మంది ఫెయిలైన చిక్కుప్రశ్న!
నీళ్లను తాడుతో కట్టగలమా? 99 శాతం మంది ఫెయిలైన చిక్కుప్రశ్న!
సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు చోటు.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్
మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్
ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు..
ఇక గణితం, సైన్స్‌, సోషల్‌లో ఫెయిలైనా పదో తరగతి పాస్‌ కావొచ్చు..
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
దీపావళికి కొత్త చీపురు కొనుగోలు చేయడం వెనకున్న రహస్యం తెలుసా?
దీపావళికి కొత్త చీపురు కొనుగోలు చేయడం వెనకున్న రహస్యం తెలుసా?
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?