బడికి పంపాలంటేనే భయమేస్తోంది! ఏడుస్తున్న చిన్నారిని కాలితో తన్నిన అంగన్‌వాడీ సిబ్బంది..!
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అంగన్‌వాడీ కేంద్రంలోనే ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లనంటూ ఏడుస్తున్న ఒక చిన్నారి పట్ల అక్కడి మహిళా సిబ్బంది అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, పన్వెల్ తాలూకా నందగావ్ గ్రామంలో చోటుచేసుకుంది.

అంగన్‌వాడీ కేంద్రానికి రావడానికి నిరాకరిస్తూ ఏడుస్తున్న చిన్నారిని సదరు మహిళ ఏమాత్రం జాలి లేకుండా కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ పసికందు మెట్ల మీదుగా కిందకు దొర్లిపడింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ లేదా మొబైల్‌లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ఘోరాలు చూశాక చిన్నారులను అంగన్‌వాడీలకు, పాఠశాలలకు పంపాలంటనే తల్లిదండ్రులు వణికిపోయే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించారు. సదరు అంగన్‌వాడీ సెంటర్ సిబ్బందిని విధులనుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…