Telangana: సరిహద్దు సమరం.. ఆ 14 గ్రామాల్లో నిలిచిన SIR సర్వే! అసలు మ్యాటరేంటంటే?
మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దులోని వివాదస్పద గ్రామాల్లో మరో కొత్త వివాదం తెర పైకి వచ్చింది. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల ఓటర్లుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సరిహిద్దులోని 14 గ్రామాలు.. ఇప్పుడు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తాము ఏ రాష్ట్రానికి చెందిన వారో తేల్చిన తర్వాతే తమ గ్రామాల్లో సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో సర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల ఓటర్లుగా కొనసాగుతున్న పరందోళి, ముకందగూడ, భోలాపటార్, అంతాపూర్ పంచాయితీల పరిదిలోని 14 గ్రామాలు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఒకే దేశం ఒకే ఓటు నినాదంతో సర్ ప్రక్రియ చేపట్టిన అధికారులు అసలు తమిది ఏ రాష్ట్రమో తేల్చాకే ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దేశంలో రెండు ఓట్లు కలిగిఉంటే చట్టప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామంటున్న అధికారులు.. ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలంటున్నారు. రెండు రాష్ట్రాల అధికారులు తమ గ్రామాలకు రావాలని తమ గ్రామాల భూసమస్యలు తీర్చాలని.. తమ సరిహద్దు వివాదానికి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఆ 14 వివాదాస్పద గ్రామాల్లో ‘సర్’ కార్యక్రమానికి ఆటంకం ఏర్పడింది. అటు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజూరా తాలూక.. ఇటు తెలంగాణ కొమురంభీం జిల్లా కెరమెరి మండల పరిదిలోని అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల పరిధిలో కొందరు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోగా, పరంధోళి, ముకదంగూడ పంచాయతీలోని పరంధోళి, కోటా, లేండిగూడ, శంకర్లొద్ది, పరంధోళి తండా, ముకదంగూడ, మహరాజ్గూడ ఓటర్లు ఇందుకు దూరంగా ఉన్నారు. బి ఎల్ వో లు, సూపర్వైజర్లు సర్దిచెప్పినా వినిపించుకోలేదు.
రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో కొనసాగుతున్న ఈ 14 గ్రామాల్లో 75 శాతం ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల భూసమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపించారు. 2014 వరకు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వ్యవసాయం చేశామని, ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా భూములకు పహాణీలు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు అటవీ అధికారులు ఈ భూములన్నీ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్నాయని, మొక్కలు నాటుతామం టూ సాగు పనులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇప్పుడు ఈ 14 గ్రామాల హిస్టరీ మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు ఎన్నికలువచ్చిన ప్రతి సారి ఈ గట్టున ఓ ఓటు.. ఆ గట్టున ఓ ఓట వేసిన ఈ 14 గ్రామాల ప్రజలు. ఎన్యూమరేషన్‌తో ఏదో ఒక రాష్ట్ర ఓటర్‌గా మాత్రమే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు రాష్ట్రాలకు పన్నులు కడుతూ.. రెండు రాష్ట్రాల రేషన్ తీసుకుంటూ.. రెండు రాష్ట్రాల కరెంట్ బిల్లులు కడుతూ.. డబుల్ దోపిడికి గురవుతున్న తమకు ఒకే ఓటర్ కార్డ్ అన్న నిర్ణయం ఓకే అయినా.. ఆ ఒక్క ఓటర్ కార్డ్ ఇచ్చే రాష్ట్రం అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల నాయకులకు ఎలక్షన్స్ వచ్చాయంటే మాత్రమే గుర్తొచ్చే తమ 14 గ్రామాలు.. ఇన్నాళ్లైకైనా రెండు రాష్ట్రాల అధికారులకు కనిపించాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 దశాబ్దాలుగా అంతులేని వ్యథను అనుభవిస్తున్న తమకు ఇప్పటికైనా ఏదో ఒక సొంత రాష్ట్రాన్ని కట్టబెట్టండని కోరుతున్నారు. రెండు రాష్ట్రాల ఉన్నతదికారులు.. రెండు జిల్లాలైన కొమురంభీం ఆసిఫాబాద్, చంద్రాపూర్ జిల్లాల కలెక్టర్లతో పాటు తహసీల్దార్లు ఇక్కడికి వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, అప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరిం చబోమని ఆ 14 సరిహద్దు గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
