ఈ చిన్ని ఆకు మెదడుకు టానిక్.. ఆ రోగాలకు బ్రహ్మాస్త్రం!
26 June 2026
Jyothi Gadda
మన పూర్వీకులు ప్రాచీన కాలం నుండి ఆయుర్వేద మూలికలను జీవనశైలిలో భాగంగా చేసుకున్నారు. అలాంటి వాటిలో బ్రహ్మీ మూలిక, వాడుక భాషలో సరస్వతి ఆకు అని కూడా పిలుస్తారు. అత్యంత శక్తివంతమైనది.
చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే ఈ ఆకు, మన శరీరంలోని అనేక దీర్ఘకాలిక సమస్యలకు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడుకు టానిక్‌లా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
బ్రహ్మీ అనగానే అందరికీ గుర్తొచ్చేది జ్ఞాపకశక్తి. ఇందులో ఉండే బాకోసైడ్లు అనే బయో-కెమికల్స్ మెదడు కణాలను చురుగ్గా మార్చి, ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను రెట్టింపు చేస్తాయి.
వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యలను నివారించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యలను నివారించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
గుండె, రక్తపోటు: బ్రహ్మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగిస్తుంది. హైబీపీ (High BP) సమస్యతో బాధపడేవారికి రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కాలేయం, జీర్ణవ్యవస్థ: కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో బ్రహ్మీ క్యాప్సూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మధుమేహం, క్యాన్సర్ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో, శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో బ్రహ్మీలోని యాంటీఆక్సిడెంట్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంపొందించడంలోనూ బ్రహ్మీ ముందంజలో ఉంటుంది. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల చర్మంపై వచ్చే తామర, సోరియాసిస్, మొటిమలు, ముడతలు మాయమవుతాయి.