AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : నాగార్జునతో ఆ సినిమా మిస్సైనందుకు బోరున ఏడ్చేసిన హీరోయిన్.. ఇప్పటికీ ఫీలవుతున్న అందాల భామ..

నాగార్జున సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ మన్మథుడు. తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో. వయసుతో సంబంధం లేకుండా అటు సినిమాలు.. ఇటు ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. అయితే నాగార్జునతో సినిమాలు చేయాలని.. ఆయన పక్కన నటించాలని చాలా మంది హీరోయిన్స్ కోరుకుంటారు. కానీ ఓ బ్యూటీ మాత్రం ఆయనతో హిట్ సినిమా మిస్సైనందుకు బోరున ఏడ్చేసిందట. ఇప్పుడు అదే విషయం నెట్టింట తెగ వైరలవుతుంది.

Tollywood : నాగార్జునతో ఆ సినిమా మిస్సైనందుకు బోరున ఏడ్చేసిన హీరోయిన్.. ఇప్పటికీ ఫీలవుతున్న అందాల భామ..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2026 | 10:07 AM

Share

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అగ్ర నాయికగా దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన నటి మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సావిత్రి, శ్రీదేవి వంటి మహానటుల నటనను చూసి స్ఫూర్తి పొందినప్పటికీ, తనకంటూ ఒక సొంత శైలిని ఏర్పాటు చేసుకున్నానని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ తనను ఒక రాణిలా ఆదరించిందని, ఇక్కడి విజయాల తర్వాతే మిగిలిన భాషల్లో మరిన్ని అవకాశాలు వచ్చాయని ఆమె గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది మీనా. చైల్డ్ ఆర్టిస్టు నుంచి కథానాయికగా ఎదిగి తనదైన ముద్ర వేసింది మీనా. తమిళం, తెలుగు పరిశ్రమల్లో వరుస సినిమాలతో మీనా అత్యంత బిజీగా ఉండేవారు. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి, ముఖ్యంగా ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, లెజెండ్రీ డైరెక్టర్ యష్ చోప్రా వంటి వారి నుంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె వెళ్లలేకపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఇక్కడ రోజుకు రెండు, మూడు షిఫ్ట్‌లు చేస్తూ నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉండటం ఒక కారణమైతే, ఉన్న అవకాశాలను వదులుకుని బాలీవుడ్ వెళ్లడం రిస్క్ అనిపించిందని ఆమె తెలిపారు. కెరీర్‌లో డేట్స్ సర్దుబాటు కాక కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలను వదులుకోవాల్సి రావడంపై మీనా స్పందించారు. వాటిలో ముఖ్యంగా నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాను వదులుకోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆ సినిమా కోసం కృష్ణవంశీ ఏకంగా 60 నుండి 65 రోజులు బల్క్ డేట్స్ అడిగారు. అప్పట్లో ఒక సినిమా 25 రోజుల్లో పూర్తయిపోయేది. వేరే సినిమాలకు అప్పటికే కమిట్ అయి ఉండటం వల్ల అంతటా డేట్స్ సర్దుబాటు చేయడం కుదరక ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆ సినిమా చూసి, అంత మంచి క్యారెక్టర్ మిస్ అయ్యానని బాధపడినట్లు చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

దీనితో పాటు రజనీకాంత్ సరసన ‘నరసింహా’ (పడయప్ప) సినిమాలో రమ్యకృష్ణ చేసిన నెగటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్ర కూడా మొదట మీనా వద్దకే వచ్చింది. అలాగే కమల్ హాసన్‌తో ‘దేవర్ మగన్’ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, గెటప్ సమస్యలు మరియు షెడ్యూల్స్ ఆలస్యం కావడం వల్ల డేట్స్ కుదరక ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని మీనా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

మీనా ఫోటో..

Nagarjuna, Meena

Nagarjuna, Meena

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us
నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. మిస్సైనందుకు ఏడ్చేసిన హీరోయిన్..
నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. మిస్సైనందుకు ఏడ్చేసిన హీరోయిన్..
ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది..
ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది..
బుడ్డదాని బుగ్గ గిల్లబోయిన బుడ్డోడు.. ఇంతలో ఊహించని షాక్..
బుడ్డదాని బుగ్గ గిల్లబోయిన బుడ్డోడు.. ఇంతలో ఊహించని షాక్..
పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ?
పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ?
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..
రేపే భాను సప్తమి.. సూర్యారాధనతో ధన, గౌరవ యోగం.. ఈ 5 తప్పులు..
రేపే భాను సప్తమి.. సూర్యారాధనతో ధన, గౌరవ యోగం.. ఈ 5 తప్పులు..
"డబ్బులు లేవా? నో ప్రాబ్లం బ్రో.. నువ్వు ఉన్నది ఇండియాలో?
నగరంలో పెట్రోల్ వినియోగం ఎక్కువగా.. హైవేపై తక్కువగా ఎందుకు..?
నగరంలో పెట్రోల్ వినియోగం ఎక్కువగా.. హైవేపై తక్కువగా ఎందుకు..?
శ్వేతనాగు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
శ్వేతనాగు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..
సామాన్యులకు పెద్ద ఊరట.. రూ.20 తక్కువ ధరతో పెట్రోల్‌..!
సామాన్యులకు పెద్ద ఊరట.. రూ.20 తక్కువ ధరతో పెట్రోల్‌..!