AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirupam Paritala: ఆ సినిమాలో హీరోగా నేను చేయాల్సింది.. కానీ మిస్సై నాని దగ్గరకు వెళ్లింది.. కార్తీక దీపం నిరూపమ్ పరిటాల..

చంద్రముఖి, కార్తీక దీపం సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సూపర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు నిరుపమ్ పరిటాల. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్నారు. అయితే కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన.. తనకు రెండుసార్లు హీరోగా చేసే ఛాన్స్ వచ్చిందని.. కానీ సీరియల్స్ కారణంగానే ఆ రెండు అవకాశాలు మిస్సైనట్లు తెలిపారు.

Nirupam Paritala: ఆ సినిమాలో హీరోగా నేను చేయాల్సింది.. కానీ మిస్సై నాని దగ్గరకు వెళ్లింది.. కార్తీక దీపం నిరూపమ్ పరిటాల..
Nirupam Paritala
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2026 | 11:54 AM

Share

కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు నిరుపమ్ పరిటాల, తన కెరీర్‌లో ఎదురైన కొన్ని కీలక, బాధాకరమైన సంఘటనలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, దర్శకుడు తేజ తనను రెండు సార్లు తిరస్కరించడం వల్ల ప్రముఖ చిత్రాలలో నటించే అవకాశాలను కోల్పోయానని ఆయన వెల్లడించారు. మొదటి సంఘటన చంద్రముఖి సీరియల్ చిత్రీకరణలో ఉన్నప్పుడు జరిగింది. దర్శకుడు తేజ ఆఫీస్ నుండి ఆడిషన్ కోసం పిలుపు వచ్చిందని, తాను షూటింగ్ మధ్యలో అనుమతి తీసుకుని వెళ్ళానని నిరుపమ్ వివరించారు. లంచ్ చేసి రమ్మని కో-డైరెక్టర్ చెప్పగా, తాను షూటింగ్ మధ్యలో ఉన్నానని, లంచ్ తర్వాత ఆడిషన్ చేస్తానని చెప్పానని నిరుపమ్ అన్నారు. ఆ సమయంలో తాను సీరియల్ చేస్తున్నానని చెప్పడంతో, తేజ లోపలికి వెళ్ళిపోయి, “ఆ సీరియలే చేసుకోమన్నారు, ఆడిషన్ వద్దన్నారు” అని కో-డైరెక్టర్ ద్వారా చెప్పించారని నిరుపమ్ తెలిపారు. అలా ఆడిషన్ కూడా చేయకుండానే తేజ తనను తిరస్కరించినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఇలాంటిదే మరో సంఘటన అష్టా చమ్మా చిత్రానికి జరిగిందని నిరుపమ్ వివరించారు. ఆ చిత్రానికి ముందురోజు ఆడిషన్ కోసం రెండు సీన్లు ఇచ్చారని, మరుసటి రోజు ఆడిషన్ చేద్దామని చెప్పారని నిరుపమ్ తెలిపారు. అయితే, ఆ రోజు రాత్రి తేజ తన చంద్రముఖి సీరియల్ చూసి, మరుసటి రోజు ఉదయం కాల్ చేసి, “నువ్వు సీరియల్ చేస్తున్నావు కదా, చూశాను, ఇంక ఆడిషన్ అవసరం లేదు” అని చెప్పి తిరస్కరించారని నిరుపమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ, “లేదంటే నాని గారి ప్లేస్‌లో ఆ రోజు అష్టా చమ్మాకు ఉండేవారు. నాని గారు అయితే ఉండకపోయేవారు” అని నిరుపమ్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

తెలుగు సినీ పరిశ్రమలో సీరియల్ నటులకు సినిమా అవకాశాలు ఎందుకు తక్కువగా ఉంటాయో అనే ప్రశ్నకు నిరుపమ్ సమాధానమిచ్చారు. తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో యష్ వంటి నటులు సీరియల్స్ నుండి వచ్చి స్టార్‌డమ్ సంపాదించుకున్నారని, కానీ తెలుగులో అది ఎందుకు సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. వీళ్ళు రోజూ కనపడే మొహాలే, మళ్ళీ సినిమాలో కూడా వాళ్ళనే పెట్టుకోవాలా” అనే ఒక అభిప్రాయం సినీ వర్గాలలో ఉండవచ్చని, లేదా “వీళ్ళు టీవీలో బిజీగా ఉంటారు, డేట్స్ సమస్య అవుతుంది” అనే ఆలోచన ఉండవచ్చని నిరుపమ్ అన్నారు. అయితే, ప్రస్తుత ఓటీటీ శకం, వెబ్ సిరీస్‌ల విస్తరణతో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని నిరుపమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us