Actress : తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్.. 24 ఏళ్లకే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోస్ చూశారా.. ?
సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంటారు. కొందరు చిన్న వయసులోనే బాలనటీనటులుగా తెరంగేట్రం చేస్తారు. ఆ తర్వాత హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం చైల్డ్ ఆర్టిస్టుగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరయయ్యింది. ప్రస్తుతం 24 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి చిత్రంలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉండాల్సిన ఈ అమ్మడు.. అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. 2019లో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 24 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి చేసుకున్నట్లు తెలియజేస్తూ తన ఇన్ స్టాలో ఫోటోస్ షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ఫేమ్ జైరా వాసం. 16 ఏళ్ల వయసులోనే దంగల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది జైరా. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. చిన్న వయసులోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో గీతా ఫొగాట్ పాత్రలో కనిపించింది. దంగల్ సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో నటించింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఆ తర్వాత ద స్కై ఈజ్ పింక్ సినిమాలో కనిపించిన జైరా వాసిం.. తన నమ్మకాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినీరంగం నుంచి తప్పుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిన జైరా వాసిం.. సోషల్ మీడియాలో ఉన్న తన ఫోటోలను సైతం డిలీట్ చేయాలని అభిమానులను కోరింది. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న జైరా వాసిం.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు నెట్టింట పోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం జైరా వాసీం వయసు 24 సంవత్సరాలు. తన పెళ్లికి సంబంధించిన రెండు ఫోటోలను పంచుకుంది.

Zaira Wasim Movie
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
మొదటి ఫోటోలో ఆమె నికాహ్ నామా, వివాహ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత మరో ఫోటోలో వధూవరులు ఇద్దరు రాత్రి ఆకాశం కింద నిలబడి చంద్రుడిని చూస్తున్నట్లు కనిపించారు. జైరా బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేసిన ముదురు ఎరుపు రంగు దుపట్టాను ధరించగా.. వరుడు క్రీమ్ కలర్ షేర్వానీని మ్యాచింగ్ స్టోల్ తో ధరించారు. ఇప్పుడు జైరా వాసీం దంపతులకు నెటిజన్స్, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జైరా వాసీం భర్త గురించి వెల్లడించలేదు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




