AP Road Accident: కాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు దుర్మరణం.. 

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 31, 2021 | 8:14 AM

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి

AP Road Accident: కాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు దుర్మరణం.. 
Road Accident

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లురు దగ్గర శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పొగాకు బేళ్లతో వెళుతున్న ట్రాక్టర్‌ – ఆటో రెండు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా.. పొగాకు బేళ్లను ట్రాక్టర్ సైడ్ డోర్స్ ఓపన్ చేసి లోడ్ చేశారు. అయితే.. ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్ దానిని గమనించలేదు. ఆటో ట్రాక్టర్ కుడివైపున ట్రాక్టర్ డోర్లవైపు నుంచి వెళ్లడంతో.. ఆటోలో కూడివైపునున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు ఇనుమనమెల్లూరు వాసులు గంటా శ్రినివాసరావు (58), రాయపాటి యమేలమ్మ (74)గా పోలీసులు గుర్తించారు. దీంతోపాటు బీమవరుపు జాలయ్య, నాలక్ష్మి, యశోదకు తీవ్రగాయలైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఒంగోలులో పండ్లు, కాయ గూరలు అమ్ముకోని తమ నివాసాలకు ఆటోలో వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఒంగోలు రూరల్ సీఐ రాంబాబు వెల్లడించారు. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

India vs England 2021: టీమిండియాతో టెస్ట్ సిరీస్‌ ముందు ఇంగ్లండ్‌కు షాక్.. క్రికెట్‌కి దూరమైన ఆల్ రౌండర్

Viral Video: చూస్తుండగానే కుప్పకూలిన భారీ వాటర్ ట్యాంక్.. వైరల్ అవుతున్న భీకర దృశ్యాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu