Police: అచ్చం సినిమా సీనే.. గ్యాంగ్‌స్టర్‌‌‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు

Cops undercover: అసలు క్రైంబ్రాంచ్‌ పోలీసుల ఆపరేషన్‌ ఎలా ఉంటుందో తెలుసా..? మీరు ఎప్పుడైనా చూశారా..?  కరుడగట్టిన నేరగాళ్లను వాళ్లు ఎలా అరెస్ట్‌ చేస్తారు ?

Police: అచ్చం సినిమా సీనే.. గ్యాంగ్‌స్టర్‌‌‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
Ahmedabad Cops Went Underco
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2021 | 6:19 PM

అసలు క్రైంబ్రాంచ్‌ పోలీసుల ఆపరేషన్‌ ఎలా ఉంటుందో తెలుసా..? మీరు ఎప్పుడైనా చూశారా..?  కరుడగట్టిన నేరగాళ్లను వాళ్లు ఎలా అరెస్ట్‌ చేస్తారు ? పోలీసుల ఆపరేషన్  లైవ్‌‌లో చూస్తే ఎలా ఉంటుంది. మహేష్ బాబు సినిమా సీన్‌ను మించి ఉంటుంది. తాజాగా గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులు మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ కిశోర్‌ లుహర్‌ను చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. పఠాన్‌ జిల్లా అమర్‌పుర దగ్గర ఓ హోటళ్లో తన అనుచరులతో కూర్చున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.

కిశోర్‌పై ఒక్కటి కాదు రెండు కాదు 14 కేసులు ఉన్నాయి. దాడులు ,లూటీలు, రేప్‌ కేసుల్లో పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న కిశోర్‌ను క్రైబ్రాంచ్‌ వలపన్ని పట్టుకుంది. గ్యాంగ్‌ కూర్చున్న ప్రదేశాన్ని మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టారు. కిశోర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. అతడు రివాల్వర్‌ తీయబోయాడు. కాని ప్రాణాలకు తెగించిన పోలీసు అతడిని కదలకుండా చేశాడు. రివాల్వర్‌ లాక్కున్నాడు.

దాదాపు 10 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కిశోర్‌తో పాటు అతడి గ్యాంగ్‌సభ్యులను అరెస్ట్‌ చేశారు. వాళ్ల దగ్గరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌పై అహ్మదాబాద్‌ క్రైబ్రాంచ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. పోలీసుల సాహసాన్ని అందరూ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి : Minister Srinivas Goud: వివాదంలోకి ప్ర‌జ‌ల‌ను లాగ‌డం సరికాదు.. ఏపీ మంత్రుల కామెంట్స్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్..

Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా