Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా

చాలా మంది లాగే ఆయనదీ సాధారణ జీవితమే. చిన్న చాయ్ కొట్టు పెట్టుకుని పొట్టపోసుకుంటున్నాడు. ఆయనకు.. ప్రధాని మంత్రితో మాట్లాడే అవకాశం వచ్చిందంటే నమ్ముతారా! కానీ నిజం.

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. 'మన్ కీ బాత్'లో వరంగల్ చాయ్ వాలా
Warangal Chai Wala
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 01, 2021 | 7:59 AM

ప్రధాని మోడీ దేశంలోని సమకాలీన పరిస్థితులు.. సమస్యలపై తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా చివరి ఆదివారం కీలక ప్రసంగం చేస్తుంటారు. ఆయా అంశాలను బట్టి వివిధ రంగాల్లోని ప్రజలతోనూ ఆయన దేశ ప్రజలకు పరిచయం చేస్తుంటారు. మన్ కీ బాత్‌లో దేనిపై మాట్లాడాలో, ప్రస్తావనకు అర్హులైన వ్యక్తుల వివరాలను పంపాల్సిందిగా దేశ ప్రజలను ఆయన ప్రతిసారి కోరుతుంటారు. ఈ క్రమంలోనే జులై నెలకు సంబంధించిన మన్ కీ బాత్ లో ఆత్మ నిర్భర్ భారత్ పై మాట్లాడనున్న ప్రధాని… ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణకు చెందిన ఓ సాధారణ చాయ్ వాలాను ఆహ్వానించారు.

తెలంగాణకు చెందిన టీ షాపు నిర్వాహకుడు పాషాకి.. ప్రధాని మోదీతో మాట్లాడే ఛాన్సొచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మాట్లాడుతారు సిద్ధంగా ఉండండి అంటూ.. పీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆత్మనిర్భర్ పథకం కింద తీసుకున్న పదివేల రూపాయల రుణంతో తన దశ దిశ తిరిగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాషా.

వరంగల్ ఎంజీఎం దగ్గర 18 ఏళ్లుగా ఫుట్ పాత్ పై టీ స్టార్ నడుపుతూ జీవనం సాగిస్తున్న మహ్మద్ పాషాకు మన్ కీ బాత్ కార్య్రమంలో ప్రధానమంత్రి మోడీతో మమాట్లాడే అవకాశం దక్కింది. ఈయన గత ఆగస్టులో పీఎం ఆత్మ నిర్బర్ పథకం ద్వారా 10 వేల రుణం తీసుకున్నాడు. టీ అమ్ముతూ గూగుల్ పే, పోన్ పే ద్వారా ఎక్కువ మొత్తంలో ఆర్ధిక లావా దేవీలు నిర్వహిస్తున్నాడు.

జులై ప్రసారమయ్యే మాన్ కీ బాత్ లో ప్రధాని మోడీతో మాట్లాడేందుకు అత్మనిర్బర్ పథకం ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్న వారిలో అతి తక్కువ మందిని ఎంపిక చేయగా మహ్మద్ పాషా కు అవకాశం దక్కింది. ఇందులోె భాగంగా ప్రధాని మోడీ ఈ రోజు (గురువారం) పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్నారు. వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకోనున్నారు.

తండ్రి దగ్గర పన్నెండేళ్ల వయస్సు నుంచి టీ స్టాల్ లో పని చేస్తూ ఇంటర్ వరకు చదువుకున్నాడు మహ్మద్ పాషా. ఆర్ధిక ఇబ్బందులతో చదువు మానేసి ఎంజీఎం దగ్గర టీ షాపు నడుపుతున్నాడు.

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు