CORONA VACCINE: రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!
కరోనా సెకెండ్ వేవ్ దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వుండడం, కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వుండడం కారణంగా
CORONA VACCINE GAP BETWEEN TWO DOSES: కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వుండడం, కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వుండడం కారణంగా కొంత ఊరట చెందే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం ఇంకా ఆందోళన కలిగిస్తూనే వుంది. ప్రతీ రోజు నాలుగు వేలకుపైగా మరణాలు రికార్డవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. మరణాల విషయంలో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI) కలత చెంది కన్నీరు పెట్టుకున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కరోనాకు అంతమెప్పుడు? ఎలా? అన్న అంశాలు ఎక్కడ చూసిన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. మీడియా, పత్రికల్లో గణాంకాలను, చికిత్సలో సమస్యలను, ఆసుపత్రుల దగ్గర దయనీయ దృశ్యాలను చూస్తూ ఇళ్ళలో జనం బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పాటించాల్సిన నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడంతోపాటు.. అవకాశం దొరికిన వెంటనే వ్యాక్సిన్ (VACCINE) వేయించుకోవడమే ప్రస్తుతానికి దేశప్రజల కర్తవ్యమని పలువురు సూచిస్తున్నారు. అయితే.. వ్యాక్సిన్ పంపిణీలో జాప్యం చాలా మందికి కలవరపరుస్తోంది. దానికి తోడు వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య ఎంత గ్యాప్, ఎన్ని రోజుల నిడివి వుండాలనే విషయంపై అమెరికన్ శాస్త్రవేత్తలు (AMERICAN SCIENTISTS) కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ (VACCINE FIRST DOSE) తీసుకున్న తర్వాత రెండో డోస్ (SECOND DOSE) ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ మేలు జరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికా (AMERICA)లోని మయో క్లినిక్ వ్యాక్సిన్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్, వైరాలజిస్ట్ గ్రెగొరీ పోలండ్ ఈ విషయాలను వెల్లడించారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండో డోసుకు తీసుకునే కాలాన్ని పెంచడం ద్వారా యాంటీబాడీలు (ANTI BODIES) 20 నుంచి 300 శాతం అధికంగా పెరుగుతాయని తేలిందని గ్రెగొరీ చెప్పారు. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఈ తరహా ఫలితాలే చూసినట్లు తెలిపారు. మొదటి డోసు వ్యాక్సిన్ వేసిన వారికి రెండో డోసు వ్యాక్సినేషన్ కూడా కేటాయిస్తున్న క్రమంలో చాలామందికి వ్యాక్సిన్ అందడం ఆలస్యమవుతోందన్నారు. అందుకోసం మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ (VACCINATION) ఆలస్యం చేసి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత ఎక్కువుంటే.. వ్యాక్సిన్ అంత బాగా పనిచేస్తుందని ప్రపంచం (WORLD)లోని కొన్ని స్టడీలు కూడా చెప్తున్నాయి. అంతేకాకుండా ఒక డోస్ వ్యాక్సిన్‌తో ఇమ్యూన్ సిస్టమ్ (IMMUNE SYSTEM) పనితీరు మెరుగవుతుందని తెలిపారు. దానికి ఎక్కువ టైం ఇస్తే వైరస్‌ను నాశనం చేసేందుకు మరింత శక్తివంతంగా మారుతుందని.. ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ అంత ఎక్కువ పవర్‌ఫుల్‌గా తయారవుతుందని వివరిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ (FYZER VACCINE) ఫస్ట్ డోస్ ఇచ్చి.. సెకండ్ డోస్‌ను మూడు వారాలకు బదులు మూడు నెలలకు ఇస్తే 3.5 రెట్లు అధికంగా యాంటీబాడీలు తయారయ్యాయని వారు తెలిపారు. రెండు డోసుల మధ్య తేడా 9 నుంచి 15 వారాలుంటే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు, వైరస్ బారిన పడడం, మరణాలు చాలా వరకు తగ్గాయని సైంటిస్టులు వెల్లడించారు. అదే గ్యాప్ 6 నెలలుంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కెనడా సైంటిస్టుల స్టడీలో తేలింది.
మనదేశంలోను రెండు డోసుల మధ్య గ్యాప్ ఎన్ని రోజులుండాలనే విషయంపై మొన్నటి దాకా సందిగ్ధత కొనసాగింది. చివరికి నిపుణుల కమిటీ సూచనల మేరకు కోవిషీల్డు వ్యాక్సిన్ (COVIESHIELD VACCINE) తీసుకున్న వారికి రెండో డోసు 8 నుంచి 12 వారాలు వుండాలని కేంద్రం నిర్దేశించింది. అయితే ఈ గ్యాప్ పెంచడాన్ని కొందరు తప్పు పట్టారు. వ్యాక్సిన్ కొరత వుండడం వల్లనే కేంద్ర ఈ అర్థం లేని నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే.. దీని వెనుక శాస్త్రీయ పరిశోధనలున్నాయనే విషయం తాజాగా అమెరికన్ సైంటిస్టుల స్టడీ ద్వారా వెల్లడైంది. దీని ద్వారా మొదటి డోసును వీలైనంత ఎక్కువ మందికి పంపిణీ చేసేందుకు వీలు కలుగుతోంది.
ALSO READ: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి బైడెన్ శాశ్వత పరిష్కారం.. కొత్త ప్రతిపాదన ఇదే!