University Of Hyderabad: యూనియూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు? ఎలా అప్లై చేసుకోవాలంటే..

University Of Hyderabad Recruitment 2021: హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఉన్న యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (యూఓహెచ్‌)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేన్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజ‌ర్‌, ఆఫీస్ అటెండెంట్..

University Of Hyderabad: యూనియూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు? ఎలా అప్లై చేసుకోవాలంటే..
University Of Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 15, 2021 | 6:17 AM

University Of Hyderabad Recruitment 2021: హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఉన్న యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (యూఓహెచ్‌)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేన్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజ‌ర్‌, ఆఫీస్ అటెండెంట్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజ‌ర్లు (03), ఆఫీస్ అటెండెంట్ (01) పోస్టును భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ప్రోగ్రాం మేనేజ‌ర్ పోస్టుకు ద‌రఖాస్తు చేసుకునే వారు.. పోస్టు గ్రాడ్యుయేష‌న్‌/ ఎంబీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో ప‌ని అనుభవంతో పాటు క‌మ్యూనికేష‌న్స్ స్కిల్స్ ఉండాలి.

* ఆఫీస్ అటెండెంట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఆఫీస్ అటెండెంట్‌గా ప‌ని చేసిన‌ అనుభ‌వం ఉండాలి. వీటితో పాటు ఇంగ్లిష్ చ‌ద‌వ‌డం, రాయ‌డం తెలిసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ప్రోగ్రాం మేనేజ‌ర్ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు రూ. 35,000 జీతంగా అందిస్తారు. ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెల‌కు రూ. 15,000 జీతంగా అందిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల‌ను గ‌చ్చిబౌలిలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ అడ్ర‌స్‌కు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణకు చివ‌రి తేదీగా 25-06-2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Suresh Raina: ఆ విషయంలో ద్రావిడ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.. కీలక విషయాన్ని వెల్లడించిన సురేష్ రైనా..

Vijayasanthi : ఠికాణా లేక భూములు అమ్ముకునేంత వరకు తీసుకువచ్చిన మీకు.. ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? : విజయశాంతి

Bharat Biotech : ‘కోవాగ్జిన్‌’టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్​కి భారీ భద్రత, 64 మంది కమాండోలతో సిఐఎస్ఎఫ్ పహారా షురూ