Vijayasanthi : ఠికాణా లేక భూములు అమ్ముకునేంత వరకు తీసుకువచ్చిన మీకు.. ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? : విజయశాంతి

భూముల అమ్మకం అంశంపై బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, మరి రాష్ట్రంలో ఈ భూముల అమ్మకాలు ఏంటని

Vijayasanthi : ఠికాణా లేక భూములు అమ్ముకునేంత వరకు తీసుకువచ్చిన మీకు.. ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు?  : విజయశాంతి
Vijayashanthi

Vijayasanthi furious over KCR Government : భూముల అమ్మకం అంశంపై బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, మరి రాష్ట్రంలో ఈ భూముల అమ్మకాలు ఏంటని విజయశాంతి ప్రశ్నించారు. తెలంగాణ భూముల అమ్మకంపై రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని విమర్శించారు. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తించాలని హితవు పలికారు.

తెలంగాణ భూముల అమ్మకం పై ఆర్థికమంత్రి హరీష్ రావు గారి వాదన చాలా అసంబద్ధంగా ఉంది. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలి అని విజయశాంతి వ్యాఖ్యానించారు. “ఈ విషయమై ప్రజలు ఉద్యమాలకు తప్పక సమాయత్తమవుతారు. ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు, ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృధా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సెక్రెటేరియట్‌కే రాని సీఎం గారికి కొత్త భవనాలెందుకు?” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంది? అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని మీ సీఎం గారు ఒప్పుకుని ఇందుకు క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే ఈ సీఎం గారు సెక్రెటేరియట్ వెళ్ళి చూస్తే కూల్చివేత…. ప్రగతి భవన్‌కు పంపితే పక్క భవనాల కూల్చివేత… వరంగల్‌కు వెళితే జైలు కూల్చివేత…. ఇప్పుడు జిల్లాలలో ఏమేమి కూలుస్తాడో అని ప్రజలు భీతిల్లే పరిస్థితులు కూడా వినబడుతున్నాయ్. ” అని విజయశాంతి అన్నారు.

Read also : Peddireddy : జూలై 8న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’, సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్.. సీఎం మెచ్చేలాపేరు తెచ్చుకోండని సూచన