Bharat Biotech : ‘కోవాగ్జిన్’టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్‌కి భారీ భద్రత, 64 మంది కమాండోలతో సిఐఎస్ఎఫ్ పహారా షురూ
కొవిడ్ – 19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తయారు చేస్తోన్న హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థకి భారీగా భద్రత పెంచారు. కేంద్రం నిర్ణయం మేరకు ఇవాళ్టి నుంచి హైదరాబాద్ శామీర్ పేట్ లో..
CISF takes over security of Bharat Biotech’s : కొవిడ్ – 19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తయారు చేస్తోన్న హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థకి భారీగా భద్రత పెంచారు. కేంద్రం నిర్ణయం మేరకు ఇవాళ్టి నుంచి హైదరాబాద్ శామీర్ పేట్ లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ కు సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్) భద్రతా చర్యలు చూస్తున్నారు. శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాదులు ముప్పు నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించిన మేరకు నేటి నుంచి పహారా షురూ అయింది.
కాగా, భారత్ లో కోవిషిల్డ్, కోవాగ్జిన్ రెండు వాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న సంగతి తెలిసిందే. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) లోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తరువాత భారత్ బయోటెక్ కంపెనీకి భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
దేశ వైద్య, ఆరోగ్య భద్రత విషయంలో భారత్ బయోటెక్ ఒక ముఖ్యమైన సంస్థని.. ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తున్నామని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.