Suresh Raina: ఆ విషయంలో ద్రావిడ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.. కీలక విషయాన్ని వెల్లడించిన సురేష్ రైనా..

Suresh Raina: రాహుల్ ద్రావిడ్ ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో అందరికీ తెలిసిందే. ప్రతీ అంశంపై చాలా సీరియస్‌గా ఉంటాడు. మైదానంలో...

Suresh Raina: ఆ విషయంలో ద్రావిడ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.. కీలక విషయాన్ని వెల్లడించిన సురేష్ రైనా..
Raina
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 15, 2021 | 12:21 AM

Suresh Raina: రాహుల్ ద్రావిడ్ ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో అందరికీ తెలిసిందే. ప్రతీ అంశంపై చాలా సీరియస్‌గా ఉంటాడు. మైదానంలో, మైదానం వెలుపల ద్రావిడ్ శైలి విభిన్నంగా ఉంటుంది. అయితే, మైదానంలో అడుగు పెడితే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయనతో అనుబంధం ఉన్న అనేక మంది ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. అయితే, తాజాగా సురేష్ రైనా కూడా ద్రావిడ్‌తో తన సాన్నిహిత్యం గురించి, ద్రావిడ్ ఇచ్చిన వార్నింగ్ గురించి వెల్లడించాడు. అయితే ఇదంతా తన రాబోయే పుస్తకం ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మి’ అనే పుస్తకం పేర్కొన్నాడు.

టీ షర్ట్ విషయంలో వార్నింగ్.. టీ షర్ట్ విప్పేసి రావాల్సిందిగా ఒకసారి రైనాను రాహుల్ ద్రావిడ్ హెచ్చరించాడట. ఈ విషయాన్ని రైనా తన పుస్తకంలో వెల్లడించాడు. దాంతో రైనా తన గదికి వెళ్లి టీ షర్ట్ మార్చుకుని.. ఆ టీ షర్ట్‌ని విసిరేశాడట. ఇక, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోనే రైనా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. జులై 30, 2005న దంబుల్లాలో శ్రీలంకతో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

2006 సంవత్సరంలో మలేషియాలో వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో భారత జట్టు ట్రై-సిరీస్ ఆడుతోంది. ఆ సమయంలో రైనా FCUK పేరు కలిగిన బ్రాండ్ టీ-షర్టు ధరించి వచ్చాడు. అది గమనించిన రాహుల్ ద్రావిడ్.. రైనా వద్దకు వచ్చి.. ‘‘మీరేం ధరించారో మీకు తెలుస్తా? మీరు భారతీయ క్రికెటర్. మీ టీ షర్ట్‌పై రాసిన ఉన్నది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇది సరైనది కాదు. మీరు ఇలా బయటకు వెళ్లొద్దు.’’ వార్నింగ్ ఇచ్చాడు. అయితే, రాహుల్ వార్నింగ్‌కి రైనా చాలా భయపడ్డాడట. వెంటనే వెళ్లి టీ షర్ట్ మార్చుకుని వచ్చాడట. ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలే చెప్పుకొచ్చాడు రైనా.

Also read:

Beautiful Art: నాణేలతో అద్భుతమైన కళాకృతులు.. మీరు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..