- Telugu News Sports News Cricket news Eng vs nz 2nd test new zealand beat england in test series devon conway trent boult neil wagner henry nicholls
ఇంగ్లాండ్‌ను ఓడించారు.. WTC Finalకు ముందు తామేంటో చూపించారు.. న్యూజిలాండ్ విజయంలో కీలక ఆటగాళ్లు వీరే..
మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ బ్యాటింగ్ తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో 8 వికెట్లతో తేడాతో సునాయస విజయాన్నందుకొని రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
Updated on: Jun 14, 2021 | 7:44 PM

డబ్ల్యుటిసి ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌తో తలపడాలి. కానీ, అంతకు ముందు ఆతిథ్య ఇంగ్లాండ్ (ఇంగ్లాండ్) ను ఓడించడంతో తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 10.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసి గెలిచింది.

డెవాన్ కాన్వె అరంగేట్రం టెస్టులోనే పాతికేళ్ల నాటి సౌరవ్ గంగూలీ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టుతో న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాన్వె (136 బ్యాటింగ్: 240 బంతుల్లో 16x4) శతకం బాదేశాడు. ఇది మాత్రమే కాదు అతను 2-టెస్ట్ సిరీస్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మాన్ గా కూడా ఎదిగాడు.

Neil Wagner: నీల్ వాగ్నెర్ అద్భుతమైన ఆటగాడు. వాగ్నెర్ న్యూజిలాండ్ బౌలింగ్ జట్టులో కీలకమైన ఆటగాడు. 2 టెస్టుల సిరీస్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సూపర్ బౌలింగ్ చేసిన మ్యాట్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Trent Boult: లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ ఆటతీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. బంతి చేతిలో ఉంటే ఎంత ప్రభావితంగా బౌలింగ్ వేయగలడో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో నిరూపించుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

Henry Nicholls: న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసిన బ్యాట్స్‌మన్ పేరు హెన్రీ నికోల్స్. ఇంగ్లండ్‌తో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో నికోలస్ 105 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ రెండవ విజయవంతమైన బ్యాట్స్ మాన్ ఇతను.




