Jagan Review : కరోనా పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, హెల్త్‌హబ్స్‌పై సీఎం సమీక్ష.. చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం

రాష్ట్రంలో క‌రోనా నేప‌థ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు.

Jagan Review : కరోనా పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, హెల్త్‌హబ్స్‌పై సీఎం సమీక్ష..  చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం
Cm Ys Jagan
Follow us

|

Updated on: Jun 14, 2021 | 11:52 PM

AP CM YS Jagan Review on Covid Situations : రాష్ట్రంలో క‌రోనా నేప‌థ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. చిన్నారుల వైద్యానికి సంబంధించిన పీడియాట్రిక్స్ అంశాల్లో నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, వాక్సినేషన్‌, హెల్త్‌హబ్స్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఆస్ప‌త్రుల్లో కోవిడ్ బాధితుల‌కు అందుతున్న వైద్య సేవ‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, క‌ర్ఫ్యూ అమ‌లు వంటి త‌దిత‌ర అంశాల‌పై ఉన్న‌తాధికారుల‌తో సీఎం జ‌గ‌న్ చ‌ర్చించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జరిగిన స‌మావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమాల్ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, 104 కాల్‌ సెంటర్ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో హెల్త్ హబ్స్ అంశంపైనా అధికారులతో సీఎం చర్చించారు. హెల్త్ హబ్స్ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆసుపత్రులు తీసుకురావాలని పేర్కొన్నారు. రెండు వారాల్లోగా హెల్త్ హబ్స్ పై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు నిర్దేశించారు.

Read also : Peddireddy : జూలై 8న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’, సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్.. సీఎం మెచ్చేలాపేరు తెచ్చుకోండని సూచన