TSPSC Group 2 Exam Dates: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష తేదీలు వచ్చేశాయ్..! ఓఎంఆర్ పద్ధతిలోనే ఎగ్జాం
లంగాణ గ్రూప్-2 నియామక పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలోనే పరీక్ష..
హైదరాబాద్, జులై 16: తెలంగాణ గ్రూప్-2 నియామక పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) పద్ధతిలోనే పరీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
కాగా దాదాపు 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి గరిష్ఠంగా 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నందున ఈ రెండు తేదీల్లో పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంవత్సరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.