TG CETs 2025 Schedule: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఈఏపీసెట్ పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. దీని ద్వారా ఈ ఏడాది నిర్వహించనున్న ఈఏపీసెట్ తోపాటు ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్ వంటి కీలక పరీక్షల తేదీలు వెల్లడించింది..

TG CETs 2025 Schedule: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఈఏపీసెట్ పరీక్ష ఎప్పుడంటే?
TG CETs 2024 Schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2025 | 6:56 PM

హైదరాబాద్, జనవరి 15: తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌ జరగనుంది. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌, ఫార్మసీ) పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇక మే 12న తెలంగాణ ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్‌, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి బుధవారం (జనవరి 15) విడుదల చేసింది. ఈ పరీక్షలకు జేఎన్‌టీయూ(హెచ్‌), ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కన్వీనర్‌లుగా వ్యవహరించనున్నాయి. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి ప్రతీ యేటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలను ఈ కింది షెడ్యూల్‌లో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!