School Holidays: అక్కడి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!

School Holidays: ఒక వైపు పండగలు, మరో వైపు చలి గాలలు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు మరిన్ని సెలవులు ప్రకటిస్తున్నాయి రాష్ట్రాలు. చలి తీవ్రత పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి..

School Holidays: అక్కడి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2025 | 4:46 PM

శీతాకాలపు చలి ఉత్తర భారతదేశంలో మరింత పెరగడంతో అనేక జిల్లాలు విద్యార్థులకు పాఠశాల సెలవులను పొడిగించాయి. చలి ప్రభావం పిల్లలపై చూపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పాఠశాల సెలవుల జాబితా చూద్దాం.

చలి తీవ్రత కారణంగా ఘజియాబాద్ పాఠశాలలు జనవరి 18 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఘజియాబాద్‌లో, జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్ర విక్రమ్ సింగ్ 1 నుండి 8 తరగతుల వరకు శీతాకాల సెలవులను ప్రకటించారు. ఎందుకంటే జిల్లాలో ప్రస్తుతం చలిగాలులు ఉన్నాయి. 18వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. అయితే విద్యా సంస్థలకు అనుబంధంగా ఉన్న ఇతర ఉద్యోగులందరూ విధులకు రిపోర్ట్ చేస్తారు. UP బోర్డ్, CBSE, ICSE, ఇతర బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని కౌన్సిల్‌లు, మాధ్యమిక పాఠశాలలకు ఆర్డర్ వర్తిస్తుంది.

ఇక పాట్నాలోని పాఠశాలలు జనవరి 15 వరకు మూసి ఉంచారు. పాట్నాలో, జిల్లా మేజిస్ట్రేట్ జనవరి 15 వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రీ-స్కూళ్లలో 8వ తరగతి వరకు అన్ని విద్యా కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ చల్లని వాతావరణంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. 8వ తరగతి పైన ఉన్న తరగతులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల మధ్య బోధనకు సమయం పరిమితం చేశారు.

ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని జైపూర్, దౌసా, సికార్, బుండి, జైసల్మేర్, జోధ్‌పూర్, పాలి, బీవార్, ధోల్‌పూర్, ఝలావర్‌లోని పాఠశాలలు చలిగాలుల కారణంగా 8వ తరగతి వరకు జనవరి 14 వరకు మూసి వేయగా, చలి తీవ్రత పెరిగినట్లయితే మళ్లీ పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. 9 నుంచి 12వ తరగతి వరకు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యేలా సమయాన్ని సవరించారు.

ఇక గోరఖ్‌పూర్ పాఠశాలలు కూడా అంతే. జనవరి 14 వరకు మూసివేసి తిరిగి ప్రారంభం అయ్యాయి. మళ్లీ చలి ఎక్కువగా అయినట్లయితే మళ్లీ మూతపడే అవకాశం ఉంది.

తమిళనాడులో 20వ తేదీ వరకు సెలవులు

ఇక పొంగల్ వేడుకల కారణంగా తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 20 వరకు మూసివేయనున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా జనవరి 13 న మూసివేయనున్నారు.

తెలంగాణ పాఠశాలలు జనవరి 16 వరకు

తెలంగాణలో మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుండి జనవరి 16 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరి 17న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే 18వ తేదీన శనివారం అవుతుంది. దీంతో కొన్ని పాఠశాలలు 20వ తేదీన తెరుచుకోనున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాలలు ఫిబ్రవరి 28 వరకు క్లోజ్

జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాల విద్యా శాఖ శీతాకాల సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు డిసెంబర్ 10, 2024 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు మూసివేయనున్నారు. అలాగే 6 నుండి 12 తరగతుల పాఠశాలలు డిసెంబర్ 16, 2024 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు మూసి ఉండనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి