IIT Baba at Mahakumbh: మ‌హాకుంభ్‌లో ఐఐటీ బాబా.. ఇంగ్లీష్‌లో వేదాంతం ఇరగదీస్తుండు! వీడియో

ప్రయాగ్ లో జరుగుతున్న మహా కుంభమేళకు యావత్ ప్రపంచం నుంచి భక్తులు, సాధువులు లక్షలాది మంది తరలివస్తున్నారు. అయితే ఈసారి ఈ మహాకుంభ్ లో టెకీ బాబా దర్శనమిచ్చాడు. ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివి.. కొన్నాళ్లు ఉద్యోగం చేసిన టెకీ బాబా.. ఆ ఉద్యోగం వదిలేసి సన్యాసం పుచ్చుకున్నట్లు చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..

IIT Baba at Mahakumbh: మ‌హాకుంభ్‌లో ఐఐటీ బాబా.. ఇంగ్లీష్‌లో వేదాంతం ఇరగదీస్తుండు! వీడియో
IIT Baba at Mahakumbh
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2025 | 4:41 PM

ప్రయాగ్‌రాజ్‌, జనవరి 15: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా ప్రారంభమైన ‘మహా కుంభమేళా’కు భక్తులు పోటెత్తారు. భక్తులంతా త్రివేణి సంగమానికి (గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే చోటు) తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ మ‌హాకుంభ్‌కు దేశ నలుమూలల నుంచి ర‌క‌ర‌కాల సాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటున్నారు. ఇక సాధువుల్లో ఆధునిక జీవితానికి స్వస్తి పలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న కొంద‌రు టెకీ బాబాలు కూడా మ‌హాకుంభ్‌లో దర్శనమిచ్చారు. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకుని బాబాగా మారిన ఓ సాధువు మ‌హాకుంభ్‌కు వచ్చాడు. ప్రస్తుతం ఈ ‘ఐఐటీయన్ బాబా’ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మహాకుంభ్‌కు వచ్చిన రకరకాల బాబాలను మీడియా ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో ఈ ఐఐటీ బాబా కథనం వెలుగులోకి వచ్చింది. అతడి మాటతీరుని చూసి ఆశ్చర్యపోయిన మీడియా ప్రతినిథులు అతడిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చాడు. తన పేరు అభ‌య్ సింగ్ అని, తాను IIT బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివినట్లు తెలిపాడు. దీంతో అందరూ ఆయ‌న్ను ఐఐటీ బాబాగా పిలవడం ప్రారంభించారు. కుంభ‌మేళాకు వ‌స్తున్న భ‌క్తులు ఐఐటీ బాబాతో ఫొటోలు దిగుతుండటంతో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు.

ఇవి కూడా చదవండి

ఎవరీ అభ‌య్ సింగ్‌?

ఐఐటీ బాబా అభ‌య్ సింగ్‌ది హ‌ర్యానా రాష్ట్రం. శాస్త్ర, సాంకేతిక జీవితాన్ని వ‌దిలేసి ఆయ‌న‌.. ఆధ్మాత్మిక లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ దశకు ఎందుకు చేరారని ప్రశ్నించగా.. ఇదే అత్యుత్తమ దశ అని సమాధానం చెప్పాడు. ఇంజినీర్ బాబా ఫోటోగ్రాఫీ, ఆర్ట్స్ ప‌ట్ల ఫోక‌స్ పెట్టడానికి ముందు బాంబేలో నాలుగేళ్ల పాటు చదువుకున్నాడు. అక్కడి క్యాంప‌స్ ప్లేస్‌మెంట్‌లో ఓ జాబ్ కూడా సంపాదించాడు. ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలో కొన్నేళ్లు ప‌నిచేసి, జాబ్‌ వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. నిజానికి, ఐఐటీలో చదివే సమయంలోనే ఫిలాసఫీ వైపు మొగ్గు చూపాడట. పలు ఫిలాసఫీ కోర్సులు కూడా చదవడంతోపాటు పోస్ట్ మాడర్నిజం, సోక్రటీస్, ప్లేటోలనూ చదివేశాడు. శివుడిని ఆరాధించే ఐఐటీ బాబా.. ఇప్పుడు ఆధ్యాత్మిక‌త‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఇంగ్లీష్ భాష‌లో అనర్గలంగా చెబుతున్నాడు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మిక‌త‌ను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపాడు. కాగా జనవరి 13న ప్రారంభమైన మహాకుంబ్‌ ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.