Harsha Richhariya: కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా సాథ్వి హర్ష్ రిచారియా.. ఆమె ఎవరో తెలుసా..?
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఓ మహిళా సాధ్వి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సాధ్వి దుస్తులతో కుంభమేళా వేదిక దగ్గర హల్‌చల్ చేస్తున్నారు హర్ష్ రిచారియా.. అంతేకాదు స్వామీజీలతో కలిసి రథంపై ఆమె ఊరేగారు.. అంతేకాకుండా కేవలం సాధువులకు మాత్రమే ప్రవేశం కల్పించే షాహీ స్నాన్‌లో హర్ష్ రిచారియాకు కూడా స్థానం కల్పించారు.
కుంభమేళా జరుగుతున్న త్రివేణీ సంగమ తీరం భక్తకోటితో నిండిపోయింది. కనుచూపుమేర ఎటుచూసినా భక్తుల పుణ్యస్నానాలే. ప్రయాగ్‌రాజ్‌కు తొలిరోజు కోటి 75 లక్షల మంది వస్తే.. సంక్రాంతి రోజున రెండు కోట్ల మంది వచ్చారు. ఇదే రద్దీ మూడో రోజు బుధవారం కూడా కొనసాగుతోంది.. మరీ ముఖ్యంగా.. విదేశీయులు సైతం కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా మారింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కావడంతో ఇప్పుడు మిస్ అయితే.. మళ్లీ ఇలాంటి మహా కుంభమేళాలో పాల్గొనడం దాదాపుగా అసాధ్యం. అందుకే.. పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
అయితే.. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఓ మహిళా సాధ్వి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సాధ్వి దుస్తులతో కుంభమేళా వేదిక దగ్గర హల్‌చల్ చేస్తున్నారు హర్ష్ రిచారియా.. అంతేకాదు స్వామీజీలతో కలిసి రథంపై ఆమె ఊరేగారు.. అంతేకాకుండా కేవలం సాధువులకు మాత్రమే ప్రవేశం కల్పించే షాహీ స్నాన్‌లో హర్ష్ రిచారియాకు కూడా స్థానం కల్పించారు.. దీంతో కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్న హర్ష రిచారియా గురించి గూగుల్ కూడా వెతుకుతున్నారు నెటిజన్లు.. కుంభమేళాలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి..
అయితే సాధ్వి హర్ష్ రిచారియా తీరుపై భగ్గుమన్నారు జ్యోతిష్య పీఠం శంకారాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. పవిత్ర కుంభమేళాలో అందానికి ప్రాధాన్యత లేదని , అధ్యాత్మికతకు మాత్రమే చోటు ఉంటుందని స్పష్టం చేశారు. సాధువులతో కలిసి రథంపై ఊరేగడం.. షాహీస్నాన్‌లో పాల్గొనడం హిందూ ధర్మానికి విరుద్దమన్నారు. కుంభమేళాలో ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు శంకరాచార్య
కొన్ని సార్లు తాను రెండేళ్ల క్రితం సన్యాసం స్వీకరించినట్టు చెప్పారు హర్ష్ రిచారియా.. అయితే కుంభమేళాలో ఆమెపై వివాదం చెలరేగడంతో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు.. కాషాయం దుస్తులు వేసుకున్నంత మాత్రాన సన్యాసిని కావాల్సిన అవసరం లేదన్నారు. తాను శాంతిని ఇష్టపడతానని, మంత్రాలు పఠించడం ద్వారా తనకు సాంత్వన లభిస్తుందని అన్నారు.
View this post on Instagram
ఆమె బ్యాక్ గ్రౌండ్‌కు వెళ్తే హర్ష్ రిచారియా స్వస్థలం ఉత్తరాఖండ్… యాంకర్‌గా, మోడల్‌గా పనిచేశారు.. రెండేళ్ల క్రితం నుంచి ఆమె అధ్యాథ్మిక బాట పట్టినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. భోపాల్‌కు చెందిన నిరంజని అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ కైలాసానంద్ మహారాజ్‌కు శిష్యురాలిగా ఉన్నారు. దీంతో పాటు రిచారియా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు..ప్రొఫెషనల్ హోస్ట్ కూడా కావడంతో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఆమె ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు రావడంతో ఆమె వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. ‘అందమైన సాధ్వి’గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హర్ష రిచార్య ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..