Success Story: నాడు IIT, NITల్లో సీటు కోసం పడిగాపులు.. కానీ నేడు ఏడాదికి రూ.అరకోటి వేతనం! టెకీ విజయ గాథ

ఎంత గొప్ప కాలేజీలో చదివితే అంత మంచి ఉద్యోగం వస్తుందనేది మొన్నటి మాట. కానీ ఎక్కడ చదివినా.. పట్టుదల, కృషి ఉంటే అనుకున్నది సాధించొచ్చని నిరూపించాడో టెకీ. కానీ అందుకు పట్టువదలని కృషి, నిరంతరం తనను తాను మెరుగుపరచుకునే తత్వం అవసరం అంటున్నాడు. దాని ఫలితమే ఒకప్పుడు NIT, IITలు ముఖం తిప్పేసినా.. నేడు మొనగాడిలా తలదన్నే జీతం అందుకుంటున్నాడు..

Success Story: నాడు IIT, NITల్లో సీటు కోసం పడిగాపులు.. కానీ నేడు ఏడాదికి రూ.అరకోటి వేతనం! టెకీ విజయ గాథ
Pradeep Kumar Saini Success Story
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2025 | 7:35 PM

పేరుగాంచిన విద్యా సంస్థల్లో డిగ్రీలు పొందడం అనేది ఏ వ్యక్తి నైపుణ్యం, విజయాన్ని నిర్ణయించదు. ఇందుకు భిన్నంగా సాధారణ విద్యా నేపథ్యం కలిగిన వారు కూడా వారి అకుంటిత కృషి, అంకితభావంతో విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. అలాంటి ఓ వ్యక్తి విజయగాథ ఇది. 39 ఏళ్ల ప్రదీప్ కుమార్ సైనీ టైర్ 3 కాలేజీలో డిగ్రీ చదివినా.. నేడు బెస్ట్‌ ప్యాకేజీని డ్రా చేస్తున్నాడు. తాజాగా ప్రదీప్ కుమార్ సైనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని ప్రయాణం ఎక్కడ మొదలైందో.. ఆ వివరాలు మీకోసం

ప్రదీప్ కుమార్ సైనీ.. IIT, NITల్లో ప్రవేశించడంలో విఫలమయ్యాడు. పైగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల సమయంలో TCS, Infosys, Wipro వంటి ప్రతిష్టాత్మక దిగ్గజ కంపెనీల్లో కొలువు దక్కించుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. కానీ అవేమీ ఫలితంచలేదు. దీంతో టైర్-3కి చెందిన ఓ సాదాసీదా కాలేజీలో BTech పూర్తి చేశాడు. అయితే బీటెక్ తర్వాత అతని ఏ ఉద్యోగం దొరకలేదు. 2008లో నెలకు రూ.5,400 ఓ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అలా 6 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాడు.

ఆ తర్వాత 2014లో ఏడాదికి రూ. 8 లక్షల వేతనంతో ShopClues కంపెనీలో చేరాడు. అదే కంపెనీలో పదేళ్లు పనిచేశాడు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా మళ్లీ నిరుద్యోగిగా మారాడు. ప్రస్తుతం అతడు ఓ IT కంపెనీలో రూ. 50 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. పదేళ్ల తర్వాత ఆ ఐటీ కంపెనీలో ఇంజనీరింగ్ మేనేజర్‌గా చేరాడు. ఇప్పుడు ప్రదీప్‌ ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా అత్యధిక వేతనం అందుకుంటున్నాడు. కాగా ప్రదీప్‌ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్శిటీలో BTech పూర్తి చేసాడు. అనంతరం ShopClues, Paytm, హెల్త్‌కార్ట్‌తో సహా వివిధ కంపెనీలలో పనిచేశాడు. ప్రస్తుతం అతను జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నాడు. చివరిగా జీవితానికి సంబంధించిన సక్సెస్‌ సూత్రాన్ని ప్రదీప్‌ చెబుతూ..

ఇవి కూడా చదవండి

‘నేను ఎప్పుడూ ఏ అవకాశాన్ని వదులుకోలేదు. నిరంతరం నైపుణ్యం పెంచుకున్నాను. విభిన్న డొమైన్‌లలో పని చేశాను. ఒక ప్రణాళికకు కట్టుబడి ఉండటం, తప్పుల నుంచి నేర్చుకోవడం, నిరంతర అభివృద్ధి చాలా కీలకం. నేను నా ప్రయాణంలో ప్రతి అడుగును నిశితంగా ట్రాక్ చేసాను. సక్సెస్, వైఫల్యం, పాఠాలు.. వీటి వివరణాత్మక ఎక్సెల్ షీట్లను ఉపయోగించడమే నా సక్సెస్‌ మంత్రం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.