AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CA 2024 First Ranker: సీఏ ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ఏకంగా ఫస్ట్‌ ర్యాంకుతో మెరిసిన తెలుగు తేజం

చార్జెడ్ అకౌంట్ (CA) పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యేటా వేలాది మంది చదివితే ఉత్తీర్ణత సాధించేది మాత్రం పదుల సంఖ్యలోనే. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన తెలుగు విద్యార్ధి తొలి ప్రయత్నంలోనే సీఏ ఫైనల్ పరీక్షల్లో ఏకంగా ఆల్ ఇండియల్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు..

CA 2024 First Ranker: సీఏ ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ఏకంగా ఫస్ట్‌ ర్యాంకుతో మెరిసిన తెలుగు తేజం
CA 2024 First Ranker
Srilakshmi C
|

Updated on: Jan 16, 2025 | 2:31 PM

Share

CA ఫైనల్ నవంబర్ 2024 పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 26న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో కఠినంగా ఉండే సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అరకొరకగా ఉంటుంది. ఇలాంటి కఠినమైన సీఏ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్ధులు సత్తా చాటారు. ఏపీకి చెందిన షబ్ ఓస్త్వాల్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా ఫస్ట్‌ ర్యాంక్ సాధించాడు. CA ఫైనల్ పరీక్షలో ఏకంగా 508 మార్కులు (84 శాతం) సాధించి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు కొల్లగొట్టాడు. రిషబ్ స్టడీ జర్నీ ఎలా సాగిందో అతని మాటల్లో తెలుసుకుందాం..

రిషబ్ ఓస్త్వాల్.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని తిరుపతి నివాసి. CA ఫైనల్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన రిషబ్ ప్రైవేట్ ఈక్విటీ లేదా కన్సల్టింగ్‌లో కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అంతేకాకుండా CA కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తన అనుభవాలను. చిట్కాలను కూడా పంచుకున్నాడు.

CA టాపర్ రిషబ్ ఓస్త్వాల్ సక్సెస్‌ జర్నీ ఇలా..

రిషబ్ CA ఫైనల్ పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1, 2 రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలిచాడు. 2021లో జరిగిన సీఏ ఇంటర్ పరీక్షలో ఆల్ ఇండియా 8వ ర్యాంక్ సాధించాడు. 2020లో CA ఫౌండేషన్ పరీక్షలోపై అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. రిషబ్‌ 12వ తరగతి నుండే CA కావడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ప్రస్తుతం రిషబ్‌ వయసు 22 ఏళ్లు. రిషబ్ ఈ ఏడాది కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ) ఫైనల్ పరీక్ష కూడా క్లియర్‌ చేశాడు. ముఖ్యంగా ఫైనల్‌ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు తనను ఎంతో ప్రోత్సహించారని రిషబ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తన అక్క సపోర్ట్ చేసిందని, తనను ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తుందని తెలిపాడు. ప్రస్తుతం సీఏ శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. సీఏ ఫైనల్ పరీక్షకు ముందు ఆర్టికల్ షిఫ్ట్ 5 నుంచి 6 నెలల వరకు సెలవులు ఇస్తారు. అంటే ఈ సమయంలో ప్రిపరేషన్‌ సాగించేందుకు సెలవులు ఇస్తారు. ఆ సెలవుల్లో రోజుకు సగటున 10 నుంచి 12 గంటలు చదువుకునేవాడినని రిషబ్‌ తెలిపాడు. ఇక పరీక్షకు చివరి 15 రోజుల్లో రోజుకు 14 నుంచి 15 గంటలు చదువుకున్నట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

సీఏ విద్యార్ధులకు రిషబ్‌ ఏం చెబుతున్నాడంటే..

సీఏకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులంతా ఆసక్తితో చదవాలి. వారు రోజువారీ ప్రిపరేషన్‌కు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. తదనుగుణంగా టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలి. ఆర్టికల్ షిఫ్ట్ సమయంలో రివిజన్ కోసం గరిష్ట సమయాన్ని వెచ్చించాలి. కష్టపడి, అంకితభావంతో సిద్ధమైతే కచ్చితంగా విజయం సాధిస్తారని రిషబ్‌ చెప్పుకొచ్చాడు. కాగా రిషబ్ సీఏ ప్రిపరేషన్ కోసం కోచింగ్ కూడా తీసుకున్నట్లు తెలిపాడు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.