టాపర్స్ కార్నర్

టాపర్స్ కార్నర్

ఈ టాపర్స్ పేజీ ప్రత్యేకంగా IIT, NEET, CA ఇతర ప్రతిష్టాత్మక పరీక్షలలో టాపర్‌ల విజయగాథలు, వ్యూహాలను తెలుసుకోవాలనుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రూపొందించాం. ఇక్కడ మీరు టాపర్‌ల ఇంటర్వ్యూలు, వారి దినచర్య, అధ్యయన వ్యూహాలు, టైం మేనేజ్‌మెంట్ వంటి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలలో అనూహ్యంగా రాణించడానికి విజేతలుగా నిలిచిన వారు ఇబ్బందులను ఎలా అధిగమించారో, అందుబాటులో ఉన్న వనరులను అసాధారణంగా ఎలా ఉపయోగించుకున్నారో ఇక్కడ తెలుసుకోవచ్చు.విజయ రహస్యాన్ని వారు ఎలా కనుగొన్నారో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా వారు సిఫార్సు చేసే పుస్తకాలు, ఆన్‌లైన్ టూల్స్, పునర్విమర్శ పద్ధతులను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పేజీలో టాపర్‌ల వివరణాత్మక ప్రొఫైల్‌లు, ర్యాంక్‌ల సమాచారం, వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సమస్త సంగ్రహావలోకనం పొందొచ్చు. అంతేకాకుండా టాపర్‌ల ప్రేరణాత్మక చర్చలు, వారి లైఫ్‌స్టైల్, పరీక్షలలో విజయం సాధించడంపై ప్యానెల్ చర్చలు మా వీడియో విభాగంలో అందుబాటులో ఉంటాయి. తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవాలనుకునే విద్యార్థుల కోసం, టాపర్‌ల అనుభవాల నుంచి ప్రేరణ పొందేందుకు అవసరమైన ప్రత్యేక స్టడీ చిట్కాలు, అభ్యాస షెడ్యూల్, పరీక్ష రోజు పాటించవల్సిన ముఖ్య మార్గదర్శకాలు అందించే వేదిక ఇది. కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇక్కడి కథనాలు చదివి.. విజయానికి దగ్గరి మార్గాలను మీరూ తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి

CA 2024 First Ranker: సీఏ ఫలితాల్లో సత్తాచాటిన చిత్తూరు కుర్రోడు.. ఏకంగా ఫస్ట్‌ ర్యాంకుతో మెరిసిన తెలుగు తేజం

చార్జెడ్ అకౌంట్ (CA) పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యేటా వేలాది మంది చదివితే ఉత్తీర్ణత సాధించేది మాత్రం పదుల సంఖ్యలోనే. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన తెలుగు విద్యార్ధి తొలి ప్రయత్నంలోనే సీఏ ఫైనల్ పరీక్షల్లో ఏకంగా ఆల్ ఇండియల్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు..