Inspiration Story: సివిల్స్‌లో ఫెయిల్.. కానీ IFSలో టాప్ ర్యాంక్! ఓ అమ్మాయి విజయగాథ..
UPSC IFS Topper Inspiration Story: యూపీఎస్‌సీ సివిల్స్.. ఓ సుదీర్ఘ ప్రయాణం. అంత త్వరగా చేరుకోలేం. ఎంతో కఠోర శ్రమ, అంతకు మించిన అలుపెరగని సాధనతో కూడిన పోరాటం చేయాలి. అలాంటి కష్టసాధ్యమైన పరీక్షల్లో ఎప్పుడూ అమ్మాయిలే టాపర్లుగా నిలుస్తుండటం విశేషం. ఈ పరపరంపరను కొనసాగిస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)లోనూ ఈసారి అమ్మాయే టాపర్‌గా నిలిచింది..

ఎంతో కఠనమైనా యూపీఎస్‌సీ సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించడం అంత తేలికకాదు. ఎంతో కఠోర శ్రమ, అంతకు మించిన అలుపెరగని సాధనతో కూడిన పోరాడం ఈ ప్రయాణం. అలాంటి కష్టసాధ్యమైన ఈ పరీక్షల్లో ఎప్పుడూ అమ్మాయిలే టాపర్లుగా నిలుస్తుంటారు. ఈ పరపరంపరను కొనసాగిస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)లోనూ ఈసారి అమ్మాయే టాపర్‌గా నిలిచింది. ఆమె ఎవరోకాదు.. కనికా అనాబ్. రెండు సార్లు సివిల్స్‌లో వరుస వైఫల్యాలు ఎదరువడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. అయినా వెనకడుగు వేయక రెట్టింపు వేగంతో పరుగందుకుంది.. అంతే ఇటీవల విడుదలైన సివిల్స్ విజేతల్లో ఆమె పేరు వచ్చేసింది. మూడేళ్ల కష్టం మరి.. వృథా పోదుగా! అంతేనా.. ఏకంగా ఐఎఫ్‌ఎస్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకు దక్కించుకుంది.
రాంచీకి చెందిన కనికా అనాబ్ మొదట్నుంచీ చదువులే మెరికే. కనికా తండ్రి అభయ్ కుమార్ సిన్హా జడ్జిగా పదవీ విరమణ పొందారు. తల్లి అనితా సిన్హా గృహిణి. వీరి ఏకైక సంతానం కనికా. కనికా.. బీఎస్‌సీ జువాలజీ చేశాక ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేసింది. అనంతరం ఢిల్లీలోనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించింది. అయితే అందరిలా కోచింగ్ సంస్థలో చేరకుండా.. సొంతంగానే 2021లో ప్రిపరేషన్ ప్రారంభించింది. యూట్యూబ్, ఆన్‌లైన్ మెటీరియల్‌తో సొంతంగానే ప్రిపరేషన్ సాగించింది. ఇంటర్వ్యూకు మాత్రం నిపుణుల సలహా తీసుకుంది. కానీ తొలిసారి ప్రయత్నం బెడిసికొట్టింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారీ అంతే..! ఆ తర్వాత ఐఎఫ్‌ఎస్‌పై దృష్టిపెట్టింది. ఈసారి సివిల్స్, IFS రెండూ ఒకేసారి రాసింది. ఈసారి కూడా సివిల్స్‌లో విఫలమైనప్పటికీ.. ఐఎఫ్‌ఎస్‌లో మాత్రం టాప్ ర్యాంకు సాధించింది.
వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగిపోవడం మామూలే. కానీ వాటి నుంచి బయట పడటానికి కుటుంబ సభ్యులు దోహదం చేస్తారు. కనికా కూడా ఇదే చేసింది. అవసరమైనప్పుడు మానసిక ధైర్యం కోసం కుటుంబం తోడుగా నిలిచిందిందని చెబుతుంది కనికా. రోజుకు ఏడు గంటల చొప్పున ప్రిపరేషన్ సాగించానని, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని తన విజయ రహస్యం చెబుతుంది. యూపీఎస్‌సీ పరీక్షలేమీ అందనంత ద్రాక్ష కాదు. బోలెడంత డబ్బులు పెట్టి శిక్షణ కూడా తీసుకోవల్సిన అవసరం లేదు. సొంతంగానూ ప్రయత్నించొచ్చనడానికి కనికా విజయమే నిదర్శనం. ఒడిశా కేడర్‌ని ఎంచుకున్న కనికా.. ప్రస్తుతం పీహెచ్‌డీ కూడా చేస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








