AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SSC Supply Exams 2025: టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షకు ‘ఒకేఒక్కడు’.. ఇన్విజిలేటర్లు మాత్రం ముగ్గురు! పెద్ద పరీక్షే…

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మార్చిలో జరిగిన పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మే 19న ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా మే 20వ తేదీన జరిగిన..

AP SSC Supply Exams 2025: టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షకు 'ఒకేఒక్కడు'.. ఇన్విజిలేటర్లు మాత్రం ముగ్గురు! పెద్ద పరీక్షే...
Hindi Exam For One Student
Srilakshmi C
|

Updated on: May 23, 2025 | 6:57 AM

Share

కొత్తూరు, మే 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మార్చిలో జరిగిన పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మే 19న ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా మే 20వ తేదీన హిందీ పరీక్ష నిర్వహించారు.

అయితే ఆ రోజు ఓ పరీక్ష కేంద్రంలో జరిగిన హిందీ పరీక్షకు కేవలం ఒకేఒక్క విద్యార్ధి హాజరయ్యాడు. ఆ విద్యార్ధి కోసం ఏకంగా ముగ్గురు ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. వీరితోపాటు పోలీసు సిబ్బంది కూడా ఆ పాఠశాలకు కేటాయించారు. ముగ్గురు పరీక్షా నిర్వాహకుల మధ్య ఒకే ఒక్క విద్యార్థి హిందీ పరీక్ష రాయడం విశేషం. ఈ ఘటన అల్లూరి జిల్లాలోని జీ మాడుగుల మండలం కొత్తూరు బాలుర ఆశ్రమ పాఠశాల చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

అల్లూరి జిల్లాలోని జీ మాడుగుల మండలం కొత్తూరు బాలుర ఆశ్రమ పాఠశాల-1 పరీక్ష కేంద్రంలో మే 20 (మంగళవారం) నిర్వహించిన హిందీ పరీక్ష ఒకేఒక్క విద్యార్థి రాశాడు. గెమ్మెలి శివాజీ అనే విద్యార్ధి హిందీపరీక్ష రాస్తుండగా ఒక ఇన్విజిలేటర్, ఒక చీఫ్‌ సూపరింటెండెంట్, ఒక డీఓ అధికారులు పర్యవేక్షించారు. వీరితోపాటు పోలీసు సిబ్బందిని ఆ కేంద్రానికి కేటాయించారు. అలాగే జీ మాడుగులలోని గురుకుల పాఠశాలలో కూడా ఇదే రీతిలో ఇద్దరు విద్యార్ధులు మాత్రమే పరీక్ష రాశారు. ఇక మండల పరిధిలోని గాంధీనగర్‌ కేంద్రంలో ఏడు మంది పరీక్ష రాసినట్లు ఎంఈవో చిట్టపులి బాబురావు తెలిపారు. ఆ తర్వాత రోజు నుంచి జరుగుతున్న మిగిలిన అన్ని పరీక్షలకు ఎక్కువమంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణలోనూ అతి పెద్ద ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?
తెలంగాణలోనూ అతి పెద్ద ఎయిర్‌పోర్ట్.. ఎక్కడంటే..?
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు