AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రష్యా-ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయ్.. ఇదంతా నేనే చేశా’ మళ్లీ అదే రాగం అందుకున్న ట్రంప్‌ అంకుల్

Trump-Putin Phone Call: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్‌ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌.. రష్యా, ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణ కోసం చర్చలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు..

'రష్యా-ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయ్.. ఇదంతా నేనే చేశా' మళ్లీ అదే రాగం అందుకున్న ట్రంప్‌ అంకుల్
Trump Putin Phone Call
Srilakshmi C
|

Updated on: May 20, 2025 | 11:46 AM

Share

వాషింగ్టన్, మే 20: భారత్, పాక్‌ మధ్య వేలు పెట్టి అబాసుపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్‌ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌.. రష్యా, ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణ కోసం చర్చలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తన సంభాషణ చాలా బాగా సాగిందని ట్రంప్‌ అభివర్ణించారు. పుతిన్‌తోసాగిన చర్చలు ‘యుద్ధం ముగింపు’కు ఓ ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకొచ్చారు. ద్వైపాక్షిక చర్చలు జరిపామని, రెండు పార్టీల మధ్య నేరుగా కాల్పుల విరమణ దిశగా చర్చలు సాగినట్లు ట్రంప్‌ చెప్పారు. ఇదే ముందుకు వెళ్ళే ఏకైక మార్గం అని ఆయన అన్నారు.

సోమవారం (మే 19) పుతిన్‌తో 2 గంటల ఫోన్‌లో మాట్లాడిన తర్వాత.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌లతో ట్రంప్‌ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని ఈ కాన్ఫరెన్స్ కాల్‌ ద్వారా యూరోపియన్ నాయకులతో ట్రంప్ అన్నారు. వాటికన్ సైతం చర్చలను నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ట్రంప్‌ తెలిపారు. పుతిన్‌ ఫోన్ కాల్‌ మాట్లాడిన తీరుకు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు.

భౌగోళిక రాజకీయాలన్నింటిలోకి వాణిజ్యాన్ని తీసుకువస్తానని గొప్పలు చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి రష్యా-ఉక్రెయిన్‌ సీస్‌ఫైర్‌ను వాడేసుకున్నారు. ఈ యుద్ధంకు ముగింపు పలకడం ద్వారా రష్యా అమెరికాతో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని తాను బావిస్తున్నట్లు ట్రంప్‌ అన్నారు. యుద్ధ వ్యయం, దానిపై విధించిన ఆంక్షల నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక వనరులను కోల్పోయిన రష్యాకు.. దేశంలో భారీ మొత్తంలో ఉద్యోగాలు, సంపదను సృష్టించడానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన అన్నారు. అమెరికా-రష్యా వాణిజ్యానికి ఉన్న అవకాశాలు అపరిమితమని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ గురించి కూడా ట్రంప్‌ సరిగ్గా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్ తన దేశాన్ని పునర్నిర్మించే ప్రక్రియలో వాణిజ్యంలో గొప్ప లబ్ధిదారుడిగా ఉంటుందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. ట్రంప్‌తో ఫోన్ కాల్‌ ఉపయోగకరమైనదిగా అభివర్ణించారు. గత వారం ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చలు.. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష చర్చలు కావడం విశేషం. ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా ఉక్కెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే జెలెన్స్కీ కూడా శాంతిని సాధించడానికి రాజీ పడాలని పుతిన్‌ కోరారు. మాస్కో, కైవ్ మధ్య ప్రత్యక్ష చర్చల పునఃప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరో వైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు JD వాన్స్‌. యుద్ధ పరిణామాలు తగ్గేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..