అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘క్యాన్సర్’ నిర్ధారణ.. అడ్వాన్స్‌డ్ స్టేజ్! ట్రంప్ రియాక్షన్ చూశారా..
టీవల బైడెన్ మూత్ర సంబంధ సమస్యలను ఎదుర్కోవడంతో గత శుక్రవారం ఆయనకు వైద్యులు పలు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. ఈ పరీక్షల్లో బైడెన్ కు క్యాన్సర్ నిర్ధరణ అయిందనీ ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో..

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారనైంది. అది బైడెన్ శరీరంలోని ఎముకలకు కూడా వ్యాపించిందని, అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని.. ఆయన కార్యాలయం ఆదివారం (మే 18) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇటీవల బైడెన్ మూత్ర సంబంధ సమస్యలను ఎదుర్కోవడంతో గత శుక్రవారం ఆయనకు వైద్యులు పలు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయిందనీ ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని, అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నట్లు అందులో వెల్లడించింది. తదుపరి చికిత్సకు సంబంధించిన అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
బైడెన్ క్యాన్సర్ నిర్ధారణ విషయం బయటకు రావడంతో ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, తరచూ బైడెన్ అభిజ్ఞా సామర్థ్యాలను ఎగతాళి చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ ఆరోగ్య విషయం తెలిసి మెలానియా, తాను ఎంతో బాధపడ్డామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జో త్వరగా కోలుకోవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ట్రంప్ పోస్టులో తెలిపారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా దీనిపై స్పందిస్తూ బైడెన్‌కు క్యాన్సర్ వచ్చిన విషయం తననెంతో కలచి వేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, బైడెన్ పోరాట యోధుడని, ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని తెలిపారు.
ఇక బైడెన్ పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మిచెల్, నేను.. బిడెన్ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం. క్యాన్సర్‌కు అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అతను తన ట్రేడ్‌మార్క్ సంకల్పంతో ఈ సవాలుతో పోరాడతాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. జో త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp
— Kamala Harris (@KamalaHarris) May 18, 2025
కాగా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గ్లీసన్ స్కోర్ అని పిలువబడే స్కోర్ ఉంటుంది. ఇది 1 నుంచి 10 వరకు ఉన్న స్కేల్‌లో క్యాన్సర్ కణాల తీవ్రతను సూచిస్తుంది. బైడెన్ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో ఈ స్కోరు 9గా నివేదించింది. అంటే బైడెన్ క్యాన్సర్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. బైడెన్‌కు నిర్ధారనైన ప్రోస్టేట్ క్యాన్సర్.. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స చాలా కష్టం. మెటాస్టాసిస్ ఉన్న క్యాన్సర్ అన్ని ప్రాంతాలను లక్ష్యంగా పనిచేయడం మందులకు దాదాపు అసాధ్యం. హార్మోన్ల ప్రభావంతో అభివృద్ధి చెందే ఈ క్యాన్సర్‌ను హార్మోన్ ఉత్పత్తిని నిరోధించే మందులతో చికిత్స చేయవచ్చు. ఇది వ్యాధి నియంత్రణకు కాస్త ఆశాజనకంగా ఉంటుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




