AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం ఊరికే పోదు.. పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం.. ఇంట్లో నుంచి బయటకు రాగానే..

లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. సింధ్ ప్రావిన్స్‌లో గుర్తుతెలియని దుండగులు లష్కరే తోయిబా టాప్ కమాండర్ రజౌల్లా నిజామాని అలియాస్ అబూ సైఫుల్లా ఖలీద్‌ను కాల్చిచంపారు. సింధ్ ప్రావిన్స్‌లోని మట్లీ నగరంలోని ఫాల్కారా చౌక్ సమీపంలో అతన్ని చంపినట్లు పాక్ అధికారులు తెలిపారు.

పాపం ఊరికే పోదు.. పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం.. ఇంట్లో నుంచి బయటకు రాగానే..
Terrorist Abu Saifullah
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2025 | 8:16 PM

Share

లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. సింధ్ ప్రావిన్స్‌లో గుర్తుతెలియని దుండగులు లష్కరే తోయిబా టాప్ కమాండర్ రజౌల్లా నిజామాని అలియాస్ అబూ సైఫుల్లా ఖలీద్‌ను కాల్చిచంపారు. సింధ్ ప్రావిన్స్‌లోని మట్లీ నగరంలోని ఫాల్కారా చౌక్ సమీపంలో అతన్ని చంపినట్లు పాక్ అధికారులు తెలిపారు. అతను తన ఇంటి నుండి బయటకు రాగానే.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.. దీంతో ఖలీద్ అక్కడికక్కడే చనిపోయాడు.. అబూ సైఫుల్లా ఖలీద్ మలన్ ప్రాంత నివాసి, అతను చాలా కాలంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడని అధికారులు తెలిపారు.

భారత్‌లోని నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఫేక్ ఐడీతో నేపాల్‌లో తలదాచుకున్న సైఫుల్లా ఖలీద్..ఇటీవలే సింధ్ ప్రావిన్స్‌కు మకాం మార్చాడు. పహల్గామ్‌లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సైఫుల్లా సహకరించినట్టు గుర్తించారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత.. సైఫుల్లా ఖలీద్‌కు భద్రత కల్పించింది పాకిస్తాన్‌ ప్రభుత్వం.. ఈ క్రమంలో అతన్ని కొందరు కాల్చి చంపడం కలకలం రేపింది.

కాగా.. కాశ్మీర్ జిహాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, లష్కరే తోయిబా అతనికి ఘాజీ అబూ సైఫుల్లా అనే బిరుదును ఇచ్చింది. అయితే, ఇటీవల ఆ సంస్థ అతన్ని అప్రమత్తం చేసిందని.. అతని కార్యకలాపాలను పరిమితం చేయాలని కూడా సూచించిందని సమాచారం.. అంతేకాకుండా అతనికి భద్రత కూడా కల్పించారు.. కానీ అతను మట్లి పట్టణంలోని తన ఇంటి నుండి బయటకు అడుగు పెట్టగానే.. కొందరు వ్యక్తులు అతని తల, ఛాతీపై కాల్చి హతమార్చారు..

ఈ మూడు దాడుల వెనుక సైఫుల్లా ప్రధాన సూత్రధారి..

రాంపూర్ CRPF శిబిరంపై దాడి… 2001లో, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని CRPF గ్రూప్ సెంటర్‌పై ఉగ్రవాద దాడికి రజావుల్లా నిజామాని ప్లాన్ చేశాడు. ఈ దాడిలో, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.. ఇందులో ఏడుగురు సైనికులు అమరులయ్యారు. తరువాత, ఈ దాడి ప్రణాళికకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ముందుకు తెచ్చిన పేర్లలో అబూ సైఫుల్లా అగ్రస్థానంలో ఉన్నాడు.

బెంగళూరులో వరుస పేలుళ్లు..  2005లో బెంగళూరులో జరిగిన వరుస పేలుళ్లకు కూడా అబూ సైఫుల్లా కుట్ర పన్నాడు. ఈ పేలుళ్లతో బెంగళూరు నగరం దద్దరిల్లింది. ఐటీ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.

నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. 2006 సంవత్సరంలో, నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద దాడికి ప్రయత్నించారు. భద్రతా దళాలు దాడి చేసిన వారిని సకాలంలో హతమార్చినప్పటికీ, ఈ దాడి వెనుక కూడా అబూ సైఫుల్లా సూత్రధారి అని దర్యాప్తులో స్పష్టమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..