Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమాధి తవ్వి.. మహిళ మృతదేహాన్ని వెలికితీసి.. సెల్ఫీ తీసుకున్న తాగుబోతు! చితక్కొట్టిన గ్రామస్థులు..

ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడో తాగుబోతు. అనతరం ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకోసాగాడు. గమనించిన గ్రామస్తులు ఆగ్రహంతో సదరు యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. పోలీసులు యువకుడిని కాపడబోతే గ్రామస్థులు వారిపై కూడా దాడి చేశారు. ఈ షాకింగ్‌ ఘటన..

సమాధి తవ్వి.. మహిళ మృతదేహాన్ని వెలికితీసి.. సెల్ఫీ తీసుకున్న తాగుబోతు! చితక్కొట్టిన గ్రామస్థులు..
Man Takes Selfie With Skeleton
Srilakshmi C
|

Updated on: May 23, 2025 | 7:35 AM

Share

కోల్‌కతా, మే 22: ఓ తాగుబోడు ఏడేళ్ల క్రితం పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. అనతరం ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకోసాగాడు. గమనించిన గ్రామస్తులు ఆగ్రహంతో సదరు యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. పోలీసులు యువకుడిని కాపడబోతే గ్రామస్థులు వారిపై కూడా దాడి చేశారు. ఈ షాకింగ్‌ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లా కాంటాయ్ గ్రామానికి చెందిన ప్రభాకర్ స్థానికంగా ఉన్న స్మశానంలో ఓ సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశాడు. అస్థిపంజరంగా మారిని ఆ డెడ్‌ బాడీ ఏడేళ్ల కిందట పూడ్చిపెట్టిన ఓ మహిళ మృతదేహం. ఆ తర్వాత ఆ అస్థిపంజరంని ఓ చెట్టుకు తగిలించి.. దానితో సెల్ఫీ తీసుకోసాగాడు. స్థానికులు గమనించి ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభాకర్‌ను పట్టుకుని చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగా.. ప్రభాకర్‌ను పోలీసులకు అప్పగించేందుకు గ్రామస్తులు నిరాకరించారు.

అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా స్థానికులు రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు రెండు గంటల తర్వాత అక్కడి పరిస్థితి అదుపులోకి రావడంతో గ్రామస్తుల దాడి నుంచి ప్రభాకర్‌ను కాపాడి చికిత్స కోసం కాంతి ఉపజిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. సంఘటనా స్థలంలో ఓ మద్యం బాటిల్ లభ్యమైంది. దీంతో సంఘటన జరిగిన సమయంలో యువకుడు మద్యం సేవించి ఉన్నాడని, మద్యం మత్తులో ఈ పనిచేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్ గతంలో పక్క రాష్ట్రంలోని ఒక హోటల్‌లో పనిచేసేవాడని, అతడి తాగుడు అలవాటు వల్ల ఉద్యోగం కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రభాకర్‌ సమాధి నుంచి మహిళ అస్థిపంజరాన్ని ఎందుకు బయటకు తీశాడన్నది ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.