AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: అక్కడ ఎలుకలే అమ్మవారి స్వరూపం.. భక్తులు పెట్టిన ప్రసాదం తింటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే..

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కర్ణి మాత ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ ఆలయం విశ్వాస కేంద్రంగా మాత్రమే కాదు దీని ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎలుకలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించే ఈ ఆలయ ప్రాచీన చరిత్ర.. దాని ప్రత్యేక సంప్రదాయం గురించి తెలుసుకుందాం.

Rajasthan: అక్కడ ఎలుకలే అమ్మవారి స్వరూపం.. భక్తులు పెట్టిన ప్రసాదం తింటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే..
Rat Temple In Rajasthan
Surya Kala
|

Updated on: May 23, 2025 | 7:22 AM

Share

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్‌లో కర్ణి మాత ఆలయం ఉంది. దీనిని ఎలుకల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దుర్గా దేవి అవతారంగా భావించే కర్ణి మాతకు అంకితం చేయబడింది. ఈ ఆలాయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు యదేశ్చగా తిరుగుతాయి. వీటిని కాబా అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. అయితే భక్తుల పెట్టిన ప్రసాదాన్ని ఎలుకలు తిన్నా.. తాకినా, అవి తినగా మిగిలిపోయిన వాటిని తిన్నా, అది శుభ సంకేతంగా పరిగణిస్తున్నారు.

ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు, అవి కర్ణి మాత వారసులు , అనుచరుల పునర్జన్మలు. ఒక పురాతన పురాణం ప్రకారం కర్ణి మాత సవతి కొడుకు మరణించిన తరువాత, ఆమె యమరాజును బ్రతికించమని ప్రార్థించింది. యమరాజు ఎలుకగా పునర్జన్మిస్తాడని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఎలుకలు కర్ణి మాత ఆలయంలో నివసిస్తాయనే సంప్రదాయం ఉంది.

తెల్ల ఎలుకలకు ప్రత్యేకంగా పూజలు

ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. ఇవి చాలా అరుదు. ఈ తెల్ల ఎలుకలను కర్ణి మాతకు చిహ్నంగా భావిస్తారు. వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ భక్తుడు అయినా సరే తెల్ల ఎలుకను చూస్తే.. అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటారు.

ఇవి కూడా చదవండి

కర్ణి మాతను సందర్శించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కర్ణి మాత ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ ప్రత్యేకమైన ఆలయం, దీని సంప్రదాయాల వైపు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాదు రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

సాంస్కృతిక వారసత్వం- పర్యాటక ప్రదేశాలు

కర్ణి మాత ఆలయం భారతదేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం దాని ప్రత్యేక అనుభవం, ప్రత్యేక మత సంప్రదాయం కారణంగా విదేశీ పర్యాటకులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో నిర్మించబడింది. దీనిలో అందమైన చెక్కడాలు, పాలరాయి పనితీరు చూడ చక్కగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడ్డాయి . వాటిపై దేవతలు, దేవతలు, పౌరాణిక కథలను తెలియజేసే అందమైన చెక్కడాలు ఉన్నాయి. ఈ ఆలయంలో రోజుకు అనేకసార్లు హారతి , భజనలు నిర్వహిస్తారు, ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కర్ణి మాత ఆలయం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు.. రాజస్థాన్ కి సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..