SBI Bank Jobs: ఎస్బీఐలో 1226 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నేటి నుంచే రిజిస్ట్రేషన్‌.. పూర్తి వివరాలివే..

SBI CBO Recruitment 2021: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) శుభవార్త చెప్పింది. మొత్తం 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది

SBI Bank Jobs: ఎస్బీఐలో 1226 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. నేటి నుంచే రిజిస్ట్రేషన్‌.. పూర్తి వివరాలివే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2021 | 5:26 PM

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) శుభవార్త చెప్పింది. మొత్తం 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇందులో 1100 రెగ్యులర్‌ పోస్టులు కాగా, 126 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచే (డిసెంబర్‌9) నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు డిసెంబర్‌ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్ర్కీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని ఎస్బీఐ తెలిపింది. కాగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ. 36వేలుగా ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, మెడికల్‌ అలవెన్సులు అదనంగా ఉంటాయి.

నోటిఫికేషన్‌ పూర్తి వివరాలివే.. * ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,226( రెగ్యులర్‌- 1100, బ్యాక్ లాగ్‌- 126) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. * అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అదేవిధంగా వయసు 2021 డిసెంబర్‌ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. * ఆన్‌లైన్‌ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌), స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. * అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. * ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ.750 చెల్లించాలి. * నేటి (డిసెంబర్‌ 9) నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. * రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబర్‌ 29, 2021 * అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 12 నుంచి పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డు (హాల్‌ టిక్కెట్లు) డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు. * పరీక్షలకు సంబంధించిన తేదీలు త్వరలోనే విడుదలకానున్నాయి.

Also Read:

Lance Naik Sai Teja: దేశం ముద్దుబిడ్డ.. నిను మరవదు ఈ గడ్డ.. సాయితేజకు సెల్యూట్

RRR Movie Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్.. మాటలు రావడంలేదు అంటూ..

Army chopper crash: అమరవీరుల భౌతికకాయాలను తరలిస్తుండగా యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం