Indian Army Jobs: భారత ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు గడువు తేదీ.. ఇతర వివరాలు
Indian Army Jobs: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా సంస్థల్లో ఖాళీగా ఉన్న..
Indian Army Jobs: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇందులో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, మెకానికల్ 5, ఐటీ 3, అర్కిటెక్చర్ 1 ,ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ 1, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ 8, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 1, టెలిక్యూనికేషన్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1, ఏరోనాటికల్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ప్రొడక్షన్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 1, ఆప్టో ఎలక్ట్రానిక్స్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు: అభ్యర్థుల వయసు 20 నుంచి 27 ఏళ్లు. ఎంపిక విధానం: ఇంటర్వూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అలాగే షార్ట్‌లిస్ట్ చేసినవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు దరఖాస్తులకు చివరితేదీ: 2022, జనవరి 4 వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/
ఇవి కూడా చదవండి: