Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: ఒమిక్రాన్ భయాలు.. పరీక్షల నిర్వహణపై కల్‌కత్తా యూనివర్సిటీ కీలక నిర్ణయం

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇటు భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.

Omicron: ఒమిక్రాన్ భయాలు.. పరీక్షల నిర్వహణపై కల్‌కత్తా యూనివర్సిటీ కీలక నిర్ణయం
Exams
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 10, 2021 | 10:46 AM

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇటు భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కల్‌కత్తా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని కల్‌కత్తా యూనివర్సిటీ సిండికేట్ నిర్ణయం తీసుకుంది. కొత్త వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా ఆఫ్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించలేకపోతున్నట్లు తెలిపింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూజీ, పీజీ పరీక్షల నిర్వహణ ప్రధాన అజెండాగా ఆఫ్ లైన్‌లో సీయూ సిండికేట్ సమావేశం జరిగింది. భౌతిక దూరం పాటిస్తూ ఆఫ్‌లైన్‌ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించడం కష్టతరమని సిండికేట్ భావించింది. దీంతో ఆన్‌లైన్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించాలని సిండికేట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు యూర్సిటీ వైస్ ఛాన్సలర్ సోనాలి చక్రవర్తి బెనర్జీ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ నిర్ణయాన్ని అనుబంధ కాలేజీలకు తెలియజేస్తామన్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని విద్యార్థుల నుంచి కూడా పలు వినతలు వచ్చాయని వెల్లడించారు.

ఆ మేరకు యూజీ కోర్సులకు సంబంధించిన మూడు, ఐదో సెమిస్టర్ ఎగ్జామ్స్‌తో పాటు పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను జనవరి మాసం మధ్యలో ప్రారంభించనున్నారు. యూజీ, పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్‌ను ఫిబ్రవరి మాసంలో నిర్వహించనున్నారు.

20 మాసాల అనంతరం నవంబరు 16 నుంచి కల్‌కత్తా యూనివర్సిటీలో ఆఫ్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు. కల్‌కత్తా యూనివర్సిటీ పరిధిలో దాదాపు 160 అనుబంధ కాలేజీలు ఉన్నాయి.

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో దేశంలోని పలు యూనివర్సిటీలు కూడా ఆన్‌లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపే అవకాశముంది. అలాగే సీబీఎస్‌‌‌ఐ, పలు రాష్ట్రాలు బోర్డ్ ఎగ్జామ్స్‌ను ఎలా నిర్వహించనున్నాయన్న అంశం ఆసక్తిరేపుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న వినతలు వస్తున్నాయి.

Also Read..

Samantha: మరో అవార్డ్ అందుకున్న సమంత.. ఓటీటీలో ది బెస్ట్ ఫీమేల్ యాక్టర్..

Viral Photo: ఈ ఫోటోలో మొసలి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. చాలా ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!