JEE Advanced 2025 Result Date: మరికాసేపట్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఫలితాల విడుదల తేదీ ఇదే!
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆదివారం (మే 18) జరగనుంది. మొత్తం రెండు పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి..

హైదరాబాద్, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆదివారం (మే 18) జరగనుంది. మొత్తం రెండు పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. మొదటి సెషన్ లో పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు, రెండో సెషన్ లో పేపర్ 2 మద్యాహ్నాం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. సాధారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే ఐఐటీ కాన్పుర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
జేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ స్కోర్ సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అవకాశం కల్పిస్తారు. అయిన్పటికీ యేటా ఈ పరీక్ష రాసే విద్యార్ధుల సంఖ్య ఒక్కసారిగా కూడా రెండు లక్షలను తాకలేదు. ఈసారి కూడా కేవలం 1.85 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసినట్లు ఐఐటీ కాన్పుర్ తెలిపింది. గతేడాది 1,80,200 మంది అడ్వాన్స్‌డ్ రాశారు. ఈ సారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రేదేశ్, తెలంగాణ నుంచి సుమారు 40 వేల మంది హాజరుకానున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారికి బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ 2025) పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష జూన్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.
మే 18వ తేదీన పరీక్ష పూర్తయ్యాక మే 22వ తేదీన వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాల స్వీకరణ కోసం మే 26వ తేదీ ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అనంతరం జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు తుది కీ, ఫలితాలు విడుదల చేస్తారు. జూన్ 3 సాయంత్రం 5 గంటలు జోసా కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




