AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2025 Exam Day Guidelines: రేపట్నుంచే ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులొద్దు!

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌2025 నిర్వహణకు జేఎన్‌టీయూ-కాకినాడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి కలిపి మొత్తంగా 3,62,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు..

AP EAPCET 2025 Exam Day Guidelines: రేపట్నుంచే ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులొద్దు!
EAPCET 2025 Exam
Srilakshmi C
|

Updated on: May 18, 2025 | 6:37 AM

Share

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీసెట్‌2025 నిర్వహణకు జేఎన్‌టీయూ-కాకినాడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీకి కలిపి మొత్తంగా 3,62,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఇంజినీరింగ్‌ విభాగానికి 2,80,597 మంది, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు

పరీక్ష ప్రారంభం కావడానికి కనీసం గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈలోపే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని జేఎన్టీయూ కాకినాడ వీసీ, ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రానికి చేరుకొని తమకు కేటాయించిన కంప్యూటర్‌ సరిగా పనిచేస్తుందో, లేదో సరిచూసుకోవాలని సూచించారు. ఉర్దూ మీడియంలో పరీక్ష రాసేవారికి కర్నూలు రీజనల్‌ సెంటర్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం కేటాయించినట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 పరీక్ష కేంద్రాల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ఇక ఇంజినీరింగ్‌ విభాగానికి మే 21 నుంచి 27వ తేదీల్లో మొత్తం 14 సెషన్లలో జరగనుంది. హైదరాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. రోజుకి రెండు షిఫ్టుల్లో అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డు, బ్లాక్‌ లేదా బ్లూ రంగు బాల్‌పాయింట్ పెన్ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. బయో మెట్రిక్‌ నమోదుకు ఆటంకం లేకుండా విద్యార్థులు చేతులకు మెహందీ పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్ధులు పరీక్ష కేంద్రం తెలుసుకోవడంలో తికమక చెందకుండా రూట్‌మ్యాప్‌ను హాల్‌టికెట్‌ చివరి పేజీలో ఇచ్చారు. ఇందులోని గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పరీక్ష కేంద్రం చేరుకోవచ్చు. ఈ పరీక్షకు నెగెటివ్‌ మార్కులు ఉండవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి