Intelligence Bureau Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 766 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ గ్యారెంటీ..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ (Intelligence Bureau).. గ్రూప్‌ 'బీ', 'సీ' (Group 'B', 'C' Posts) పోస్టుల భర్తీకి..

Intelligence Bureau Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 766 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే జాబ్‌ గ్యారెంటీ..
Ib Jobs
Follow us

|

Updated on: Jul 07, 2022 | 8:16 AM

IB ACIO Group ‘B’, ‘C’ Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ (Intelligence Bureau).. గ్రూప్‌ ‘బీ’, ‘సీ’ (Group ‘B’, ‘C’ Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 766

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సెక్యురిటీ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-I (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు: 70
  • అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-II (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు: 350
  • జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-I (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు: 50
  • జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-II (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు: 100
  • సెక్యురిటీ అసిస్టెంట్‌ (ఎగ్జిక్యూటివ్‌) పోస్టులు: 100
  • జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-I (MT) పోస్టులు: 20
  • జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-II (MT) పోస్టులు: 35
  • సెక్యురిటీ అసిస్టెంట్‌ (MT) పోస్టులు: 20
  • హల్వాయ్‌ కమ్‌ కుక్ పోస్టులు: 9
  • కేర్ టేకర్‌ పోస్టులు: 5
  • జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌-II (Tech) పోస్టులు: 7

వయోపరిమితి: మే 7, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 56 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్ లేదా స్టేట్‌ పోలీస్‌ ఆర్గనేషన్స్‌ లేదా డిఫెన్స్‌ ఫోర్సుల్లో పనిచేస్తున్న అభ్యర్ధులను డిప్యుటేషన్‌ లేదా అబ్జార్ప్షన్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అనుభవం, అర్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S P Marg, Bapu Dham, New Delhi-110021.

దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటన వెలువడినప్పటినుంచి 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (ఆగస్టు 19, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.