TS Inter supply exams 2022: నేటితో ముగుస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ, రీవాల్యుయేషన్, ఇంప్రూవ్‌మెంట్ దరఖాస్తు గడువు
తెలంగాణ ఇంటర్మీడియట్ రీవాల్యుయేషన్‌తోపాటు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ రోజే (జులై 6) ఆఖరు..
Telangana Inter Supplementary Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ రీవాల్యుయేషన్‌తోపాటు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ రోజే (జులై 6) ఆఖరు. జూన్ 5 (మంగళవారం) నాటకి దాదాపు 17,995ల దరఖాస్తులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ రోజు (బుధవారం)తో గడువు ముగియనుండటంతో మరిన్ని దరఖాస్తులు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఒక్కో పేపర్‌కు రూ.120ల చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. స్కాన్ చేసిన సమాధానపత్రాల కోసం రూ.600లు ఫీజు ఆన్‌లైన్ ద్వారా విద్యార్ధులు చెల్లించవల్సి ఉంటుంది.
కాగా తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల 30 నిముషాల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇక ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన విద్యార్ధులకు జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.