CSIR-CLRI Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్! రాత పరీక్షలేకుండా సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR - CLRI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

CSIR-CLRI Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్! రాత పరీక్షలేకుండా సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..
Csir Clri
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 06, 2022 | 1:19 PM

CSIR – CLRI Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ – సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CSIR – CLRI).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 16

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ. 42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూసీజీ నెట్‌ లేదా గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, అడయార్‌, చెన్నై-600020.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. జులై 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి .

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.