EMRS Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 4,062 ఉపాధ్యాయ కొలువులకు దరఖాస్తులు ఆహ్వానం
దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,062 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నోటిఫికేషన్..
న్యూఢిల్లీ, జులై 16: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4,062 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ప్రిన్సిపల్ పోస్టులు 303, పీజీటీ పోస్టులు 2,266, అకౌంటెంట్ పోస్టులు 361, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 759, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు 373 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్‌లో జులై 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్(NESTS) సూచించింది. పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం, నియమాక ప్రక్రియ వంటి ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.