Cabinet Secretariat Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్‌లో గ్రూప్-బి ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్..15 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీపర్ (గ్రూప్ -బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్..15 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీపర్ (గ్రూప్ -బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు చైనీస్ ల్యాంగ్వేజ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా చైనీస్ ల్యాంగ్వేజ్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 21, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం రెండు పేపర్లకు గానూ ఒక్కో పేపర్ 100 మార్కులకు రెండు గంటల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పేపర్లకు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్ ఇంగ్లిష్ గ్రామర్/కంప్రహెన్షన్, ఎస్సే తదితర అంశాలకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్- ఇంగ్లిస్ ల్యాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది.
అడ్రస్: Post Bag No. 001, Lodhi Road Head Post Office, New Delhi-110003.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.