Viral Pic: ‘రూల్స్‌ అందరికీ వర్తిస్తాయ్‌..!’ పోలీసధికారికి జరిమానా విధించిన ట్రాఫిక్‌ సిబ్బంది

ట్రాఫిక్‌ ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. వీటి నుంచి ఎవరికీ.. ఎటువంటి సడలింపు ఉండదు అనే నిరూపించే సంఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సగం హెల్మెట్ ధరించిన పోలీసధికారికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. .

Viral Pic: 'రూల్స్‌ అందరికీ వర్తిస్తాయ్‌..!' పోలీసధికారికి జరిమానా విధించిన ట్రాఫిక్‌ సిబ్బంది
Bengaluru Traffic Policeman Fines Another Cop For Wearing helmet Helmet
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 21, 2022 | 12:58 PM

ట్రాఫిక్‌ ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. వీటి నుంచి ఎవరికీ.. ఎటువంటి సడలింపు ఉండదు అనే నిరూపించే సంఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సగం హెల్మెట్ ధరించిన పోలీసధికారికి  బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. బెంగళూరులో ఈ విధమైన హెల్మెట్‌తో డ్రైవింగ్ చేయడం నిషేధం. ముఖ్యంగా గేర్‌లెస్ స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు హాఫ్‌ హెల్మెట్ ధరించకూడదు. ఐతే పోలీసు అధికారి అయ్యుండి.. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా హెల్మెంట్‌ ధరించినందుకు ట్రాఫిక్‌ సిబ్బంది హెల్త్ హెల్మెట్ కేసు బుక్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్రాఫిక్‌ పోలీసులు ట్విటర్‌లో సోమవారం పోస్టు చేశారు.

ఇక ఈ పోస్టును చూసిన నెటజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎవరినైనా పోలీసులు వదలరని కొందరు ప్రశంసించగా, మరికొందరేమో ఇదంతా పెద్ద డ్రామాలా ఉంది. ‘నిజమేనైతే.. కెమెరాకి ఎందుకు నవ్వుతూ పోజులిస్తున్నట్లు? జరిమానా విధిస్తే ఎవరైనా నవ్వుతారా’ అని ఒకరు, ‘అతను ఎంత సంతోషంగా కనిపిస్తున్నాడో.. ఫోటో దిగేందుకు మంచి అవకాశం దొరికినట్లుందని’ మరొకరు, ‘సర్.. అతనికి జరిమానా సరిపోదు. చాలా మంది పోలీసులు హెల్మెట్ లేకుండా వెళ్ళనివ్వడం నేను చాలా సార్లు చూశాను’ అని ఇంకొకరు, ‘పబ్లిసిటీ స్టంట్’ అని పలువురు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను తెలిపారు.

ఇవి కూడా చదవండి

ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది ట్రాఫిక్ నిబంధన. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్ కోసం ప్రయాణికులకు సూచనలు ఇవ్వడానికి పోలీసులు ఇంత డ్రామా ఆడినట్లు అధికమంది నెటిజన్లు పేర్కొన్నారు. కాగా గత నెలలో కూడా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్మెట్ పెట్టి, ట్రాఫిక్ నిబంధనలను వివరిస్తు్న్నట్లు వీడియోలో కన్పిస్తుంది. ప్చ్‌.. పాపం..! ట్రాఫిక్‌ పోలీసులకు నటన రాదనే చెప్పాలి. ఇలాంటి స్టంట్‌లు చేసి పబ్లిక్‌కి అడ్డంగా దొరికిపోతున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే