Army helicopter crashed: అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. నెలలో రెండో సారి..
అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ గ్రామంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ శుక్రవారం (అక్టోబర్ 21) కూలిపోయింది. అధునాతన టెక్నాలజీతో తయారైన ఈ హెలికాఫ్టర్ ఆర్మీ సిబ్బందిని తీసుకువెళ్తుండగా ఈ రోజు ఉదయం..
అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ గ్రామంలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ శుక్రవారం (అక్టోబర్ 21) కూలిపోయింది. అధునాతన టెక్నాలజీతో తయారైన ఈ హెలికాఫ్టర్ ఆర్మీ సిబ్బందిని తీసుకువెళ్తుండగా ఈ రోజు ఉదయం 10 గంటల 43 నిముషాలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ సియాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలానికి రోడ్డుతో అనుసంధానం లేదని భారత సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం ఘటన ప్రదేశానికి సహాయక బృందాలు చేరుకున్నాయని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పంపినట్లు డిఫెన్స్ పీఆర్‌వో గౌహతి తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఒకే నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది.
ఈ నెల ప్రారంభంలో భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో చైనాతో సరిహద్దు సమీపంలో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్‌లలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం ఉదయం 10 గంటలకు ఫార్వార్డ్ ఏరియాలో చోటుచేసుకుంది.