చదివింది 8వ తరగతే.. కానీ మర్డర్ కేసులో తప్పించేందుకు వేసిన స్కెచ్ చూస్తే మైండ్ బ్లాంకే..
అతడు చదివింది 8వ తరగతి. కాని మైండ్ మాత్రం పక్కా క్రిమినల్‌ది. పని చేసేది డ్రైవర్‌గా.. కాని అది తప్ప.. చేసేవన్నీ దగుల్బాజీ పనులు.
అతడు చదివింది 8వ తరగతి. కాని మైండ్ మాత్రం పక్కా క్రిమినల్‌ది. పని చేసేది డ్రైవర్‌గా.. కాని అది తప్ప.. చేసేవన్నీ దగుల్బాజీ పనులు. వివాహితలను ట్రాప్ చేసి వారికి దగ్గరవుతాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ వివాహిత పరిచయమైంది. ఆమె తన కుటుంబాన్ని వదిలేసి.. ఇతడితో పారిపోయింది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య గొడవలు జరగాయి. కోపంతో సదరు వ్యక్తి.. తన ప్రేయసిని చంపేశాడు. అయితే ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకునేందుకు అతడు వేసిన స్కెచ్ చూస్తే మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఇంతకీ అసలు విషయమేంటంటే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శర్వాన్ ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఢిల్లీ పరిధిలోని మిధాపూర్ ప్రాంతానికి చెందిన పూజతో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్ల తర్వాత అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే పూజకు అప్పటికే పెళ్లై.. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ ఆమె, శర్వాన్‌తో కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టింది. మొదట వీరిద్దరూ రోహ్‌తక్‌లో కొద్దిరోజులు ఉండగా.. ఆ తర్వాత యూపీలోని గోరఖ్ పూర్‌కు.. అనంతరం ఫరీదాబాద్‌లోని ముజేసర్ ప్రాంతానికి మారారు. అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఆ ఇంటి యజమానికి పూజ తన భార్య అని పరిచయం చేశాడు శర్వాన్. కొద్దిరోజులు అంతా బాగానే ఉంది. అయితే ఇటీవల పూజ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో.. శర్వాన్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 5వ తేదీన వీరి మధ్య గొడవ జరగ్గా.. ఆ సమయంలో శర్వాన్ తీవ్ర ఆగ్రహానికి గురై పూజను గొంతు నులిమి హత్య చేశాడు.
ఇక ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకునేందుకు శర్వాన్.. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేలా పూజ మొబైల్ ఫోన్, ఐడీ ప్రూఫ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ప్రాంతమంతా తాను ఒక్కడే ఉన్నట్లుగా అందరూ నమ్మేలా పక్కా స్కెచ్ రచించాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడంతా పరిశీలించగా ఆధారాలు ఏవి దొరకలేదు. ఆధారాలు మాయం చేసిన నిందితుడి తెలివితేటలకు షాక్ అయ్యారు. అయితేనేం పోలీసులు అనేకమందిని విచారించడమే కాకుండా.. ఆ చుట్టుప్రక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఎట్టకేలకు నిందితుడి ఇటీవల అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, నిందితుడు నేరం అంగీకరించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.