AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada: భారతీయ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! వచ్చే ఏడాది మర్చి నెలాఖరు నాటికి 3 లక్షల మందికి కొత్తగా పౌరసత్యం ఇవ్వనున్న కెనడా..

కెనడా 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,00,000 మంది వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల భారతీయులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 2,85,000 అప్లికేషన్లను ప్రాసెస్‌..

Canada: భారతీయ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌!  వచ్చే ఏడాది మర్చి నెలాఖరు నాటికి 3 లక్షల మందికి కొత్తగా పౌరసత్యం ఇవ్వనున్న కెనడా..
IRCC aims to grant citizenship to 3 lakh people
Srilakshmi C
|

Updated on: Oct 21, 2022 | 12:18 PM

Share

కెనడా 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,00,000 మంది వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల భారతీయులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. దాదాపు 2,85,000 అప్లికేషన్లను ప్రాసెస్‌ చేసినట్లు, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మొత్తం3 లక్షల మందికి కొత్తగా పౌరసత్వం మంజూరు చేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్‌, రెఫ్యూజిస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ కెనడా (ఐఆర్‌సీసీ) పేర్కొంది. తప్పనిసరిగా అన్ని పౌరసత్వ ప్రమాణాలు కలిగున్న దరఖాస్తుదారులకు మాత్రమే కొత్తగా పౌరసత్వం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లు ఆన్‌లైన్‌లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. 2021-2022 ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో పౌరసత్వం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 2,53,000 పౌరసత్వ దరఖాస్తులకు అంగీకారం తెల్పింది. కాగా పెరిగిన దరఖాస్తుల దృష్ట్యా ఐఆర్‌సీసీ వెయ్యి మందికి పైగా కొత్త సిబ్బందిని కూడా నియమించింది.

మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా చాలా అప్లికేషన్‌లను ఐఆర్సీసీ ప్రాసెస్ చేయలేకపోయింది. అప్పట్లో కేవలం పేపర్ అప్లికేషన్‌లను మాత్రమే ప్రాసెస్ చేసింది. అంతేకాకుండా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించలేదు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కెనడా 1,16,000 మందికి కొత్తగా పౌరసత్వాలను మంజూరు చేసింది. ఇక 2021లో కెనడా కేవలం 35,000 మందికి మాత్రమే సిటిజెన్‌షప్‌ ఇచ్చింది. భారతీయులు అత్యధికంగా వలస వెళ్లే దేశాల్లో కెనడా ముఖ్యమైన దేశం. నివేదికల ప్రకారం.. కెనడాలో దాదాపు 1.4 మిలియన్ల మంది భారత సంతతి ప్రజలు ఉన్నట్లు పేర్కొంది. 2021లో దాదాపు లక్ష మంది భారతీయులు తాత్కాలిక ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ కింద కెనడాకు వెళ్లారు. లక్ష 30 వేల మంది ఇంటర్నేషనల్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద వర్క్ పర్మిట్‌లు పొందారు. 2021-2022లో రెండు లక్షల పది వేల మంది శాశ్వత నివాసితులు కూడా కెనడియన్ పౌరసత్వాన్ని పొందారు.

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్‌ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 31, 2021 నాటికి 4 లక్షల 50 వేల మందికి స్టడీ పర్మిట్‌ మంజూరు చేసింది. కెనడాలో మొత్తం 6 లక్షల 22 వేల మంది ఫారెన్‌ విద్యార్థులు ఉండగా, వీరిలో భారతీయ విద్యార్ధులు 2,17,410 మంది ఉన్నారు. కాగా కెనడాలో కొనసాగుతున్న కార్మికుల కొరత (లేబర్‌ షార్టేజ్‌) దృష్ట్యా అత్యధిక శాతం భారతీయులు ఉద్యోగం, చదువు నిమిత్తం వెళ్తున్నారు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!